అనన్య పాండే( Ananya Pande ) పరిచయం అవసరం లేని పేరు విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి లైగర్ సినిమా ( Liger Movie ) ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమయ్యారు.ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా మాత్రం పెద్దగా సక్సెస్ కాకపోయినా ఈమెకు మాత్రం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
ఇలా నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి అనన్య పాండే గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బాలీవుడ్ స్టార్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ ( Aditya Rai Kapoor ) తో కలిసి పీకల్లోతు ప్రేమలో ఉన్నారు అంటూ వీరి గురించి గత కొద్దిరోజులుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్న విషయం మనకు తెలిసిందే.వీరిద్దరూ చట్టాపట్టాలేసుకొని ఫారెన్ వీధులలో చక్కర్లు కొడుతూ తమ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు అంటూ బాలీవుడ్ మీడియా పెద్ద ఎత్తున వార్తలను సృష్టించారు.అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని వీరు ఖండించినప్పటికీ వీరి గురించి వచ్చే ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు.
ఇక వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే ప్రముఖ ఫిలిం క్రిటిక్ ఉమైర్ సందు( Umair Sandhu ) ఈ విషయంలో మరో అడుగు ముందుకు వేసి అనన్య పాండే ప్రెగ్నెంట్( Pregnant ) అంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా ఈయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ అవునన్య పాండే ఆదిత్య రాయ్ కపూర్ ఇద్దరు ప్రేమలో ఉన్నారని, ఆదిత్య రాయ్ కపూర్ కారణంగా అనన్య పాండే ప్రెగ్నెంట్ అయింది అంటూ ఈయన సంచలనమైన ట్వీట్ చేశారు.అంతే కాకుండా గుట్టు చప్పుడు కాకుండా అనన్య పాండే అబార్షన్ కూడా చేయించుకుంది అంటూ ఈయన చేసినటువంటి ఈ ట్వీట్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.అయితే ఈయన తాను ఫేమస్ అవడం కోసం సెలబ్రిటీల గురించి ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తూ వార్తలలో నిలుస్తూ ఉంటారు అయితే ఈయన పట్ల ఎంతో మంది సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ ఈయన మాత్రం తమ ధోరణిని మార్చుకోలేదని చెప్పాలి.
ఏది ఏమైనా ఉమెన్స్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది.