డబ్బు అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి.ఎవరు అయినా సరే డబ్బు ముందు దాసోహం అని అనాలిసిందే.
ఎక్కువ డబ్బులు సంపాదించాలని ధనవంతులు అవ్వాలని ఎవరు మాత్రం అనుకోరు చెప్పండి.ధనవంతులు కొంత మంది చాలా కష్ట పడుతుంటారు.
కానీ మరికొందరు మాత్రం ఎలాంటి కష్టం అనేది లేకుండా అక్రమ మార్గంలో, అవినీతి పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ధనవంతులు అవుతుంటారు.సరిగ్గా ఇలాగే ఒక వ్యక్తి కూడా అక్రమంగా డబ్బు సంపాదించాడు.
ఎంత డబ్బు అంటే ఏకంగా ప్రపంచంలోనే అత్యంత కుబేరుడుగా పేరు గాంచిన ఎలన్ మస్క్ కి సైతం షాక్ ఇచ్చి నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు.
కేవలం ఏడు నిమిషాల్లోనే ఎలన్ మస్క్ ను సెకండ్ ప్లేస్ లోకి నెట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు.
వివరాల్లోకి వెళితే.ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు ఓ యువకుడు మాక్స్ ఫోష్ షాకిచ్చాడు.
అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్న మస్క్‌ను సెకండ్ ప్లేస్ లోకి నెట్టేసి అగ్రస్థానాన్ని అధిష్టించాడు.ఎలాంటి ఆదాయ కార్యకలాపాలు లేకుండానే బ్రిటన్‌కు చెందిన యూట్యూబర్ మాక్స్ ఫోష్ అనే యువకుడు 7 నిమిషాలపాటు ప్రపంచంలోనే అధిక కుబేరుడిగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఈ యువకుడు ఒక కంపెనీని ఏర్పాటు చేసాడు.మార్కెట్ క్యాపిటలైజేషన్ లొసుగును ఉపయోగించుకున్న ఈ యువకుడు అన్‌లిమిటెడ్ మనీలిమిటెడ్ పేరిట ఓ కంపెనీ స్థాపించాడు.ఒక్కో షేరును 50 పౌండ్లకు విక్రయించడం ద్వారా మొత్తం 500బిలియన్ పౌండ్లు ఆర్జించాడు.మనీ టేబుల్‌లో కొద్దినిమిషాలు ఫస్ట్‌ప్లేస్ లో నిలిచాడు.అయితే ఆదాయ కార్యకలాపాలు సరిగా లెక్క చూపక పోవడం వలన మోసపూరిత కార్య కలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.అందువల్ల అన్ లిమిటెడ్ మనీ లిమిటెడ్ ను అత్యవసరంగా రద్దు చేసారు అధికారులు.