ఇమ్మిగ్రేషన్ నిబంధనల విషయంలో యూకే ప్రభుత్వం( UK Government ) కీలక ప్రకటన చేసింది.బ్రిటీష్ పౌరులను వివాహం చేసుకున్న విదేశీ వ్యక్తులకు ఈ సందర్భంగా ఊరట కల్పించింది.
బ్రిటన్ పురుషుడు లేదా స్త్రీని పెళ్లిచేసుకున్న విదేశీయులు తమ జీవిత భాగస్వామ్యులు( Life Partners ) చనిపోయిన తర్వాత ఇక్కడే స్థిరపడేందుకు చెల్లించాల్సిన 2,885 పౌండ్ల రుసుమును ఎత్తివేస్తున్నట్లు యూకే వలస, పౌరసత్వ వ్యవహారాల మంత్రి సీమా మల్హోత్రా( Minister Seema Malhotra ) వెల్లడించారు.అక్టోబర్ 9 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆమె తెలిపారు.
ప్రభుత్వ నిర్ణయం కారణంగా తమ బ్రిటీష్ జీవిత భాగస్వాములు మరణించి ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విదేశీయులకు ఇది ఊరట కలిగించనుంది.
ఈ వారం పార్లమెంట్‌లో రూపొందించిన కొత్త నిబంధనల ప్రకారం అర్హత గల విదేశీ పౌరులు యూకేలో సెటిల్‌మెంట్ కోసం దరఖాస్తు రుసుమును( Settlement Fees ) మాఫీ చేసేందుకు అప్లయ్ చేసుకోవాల్సిందిగా సీమా మల్హోత్రా పేర్కొన్నారు.జీవితంలో ప్రియమైన వ్యక్తిని కోల్పోవడం అనేది ఊహించలేని బాధ అని.దీనికి తోడు ఆర్ధిక ఒత్తిడి భరించలేమన్నారు.వితంతువులు వారిపై ఆధారపడిన పిల్లలు యూకే కమ్యూనిటీలో అంతర్భాగమని సీమా చెప్పారు.సెటిల్‌మెంట్ రుసుములను భరించలేని వారికి ప్రభుత్వ నిర్ణయం ఊరట కలిగిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ అర్హత పొందిన వారిలో కుటుంబ వీసాలో భాగస్వాములు ఉన్నారు.తమ భాగస్వామి బ్రిటీష్ పౌరుడై ఉన్నా, యూరోపియన్ యూనియన్ , స్విట్జర్లాండ్, నార్వే, ఐస్‌లాండ్‌కు చెందిన వారు లేదా లీచ్టెన్‌స్టెయిన్‌లలో స్థిరపడిన స్టేటస్, సాయుధ దళాలు, గూర్ఖాలు, హాంగాంగ్ మిలిటరీ యూనియన్‌లో పనిచేసిన వారి జీవిత భాగస్వాములు ఈ రుసుము మినహాయింపు నుంచి ప్రయోజనం పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది.
కాగా.హౌస్ ఆఫ్ కామన్స్‌కు వ్రాతపూర్వకంగా ఇచ్చిన ప్రకటనలో యూకే సరిహద్దుల్లో డిజిటల్ ప్రీ ట్రావెల్ చెక్‌లను చేర్చడానికి కొత్త డిప్లొమాట్ విజిటర్ వీసా ప్రాసెస్‌ను ప్రవేశపెట్టినట్లు సీమా మల్హోత్రా తెలిపారు.
కరెంట్ డిప్లొమాటిక్ వీసా వైవర్స్ (డీవైడబ్ల్యూఎస్) డిప్లొమాటిక్ వీసా అరెంజ్‌మెంట్స్‌కు అనుకూలంగా దశలవారీగా తొలగించబడతాయన్నారు.