కొందరు వ్యక్తులు చాలా పెద్ద స్థలంలో పెద్ద ఇంట్లో నివసించాలని కోరుకుంటారు.అందుకే పెద్ద ఇళ్ళను కొనుగోలు చేస్తారు.
లేదంటే అద్దెకు దిగుతారు.ఇంతకుముందు ఆ ఇంట్లో ఎవరైనా ఉండి ఉంటే కొంచెం భయంగా అనిపిస్తుంది.
సినిమాల్లో చూపించినట్లు ఆ పెద్ద ఇంట్లో ఏదైనా దుష్టశక్తి దాగి ఉందా అనే అనుమానం చాలా మందికి కలుగుతుంది.అంతేకాదు ఇంతకుముందు యజమానులకు సంబంధించిన వస్తువులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా అనుమానం కలుగుతుంది.ఒకవేళ కొత్త ఇంటిలో అస్సలు ఊహించనిది, ప్రపంచ నుంచి దాచినది ఏదైనా కనుగొంటే? చాలా భయమేస్తుంది కదూ!

తాజాగా అలాంటి ఒక అనుభవమే యునైటెడ్ కింగ్డమ్( UK )లోని దంపతులకు ఎదురయ్యింది.వారు తమ వంటగదిలో ఒక చిన్న రంధ్రం వెనుక సీక్రెట్ రూమ్( Secret Room ) ఉందని తెలుసుకుని షాక్ అయ్యారు.ఆ రహస్య గదిని వీడియో తీసి ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేశారు.ఆ గ్రూప్ పేరు “థింగ్స్ ఫౌండ్ ఇన్ వాల్స్- అండ్ అదర్ హిడెన్ ఫైండింగ్స్”.
ఆ తర్వాత ఆ వీడియోను తొలగించారు.వంటగదిలో సింక్ కింద చెక్క రంధ్రం వెనుక రహస్య గది ఉన్నట్లు వీడియోలో కనిపించింది.
మహిళ, ఆమె భర్త రంధ్రం లోపలికి చూడగా అందులో శిధిలాలు కనిపించాయి.

సీక్రెట్ రూమ్ బాత్రూమ్ లేదా చిన్న లైబ్రరీకి( Small Library ) సరిపోయేంత పెద్దదిగా ఉంది.అందులో వెలుతురు, గాలి కోసం ఒక కిటికీ ఉంది.విద్యుత్ లేదా గ్యాస్ కోసం మీటర్, కొన్ని వైర్లు కూడా ఉన్నాయి.
ఈ రూమ్ సీక్రెట్ గా ఎందుకు ఉంచారో అర్థం కాలేదు.ఫ్లాట్ యజమాని రహస్య గది గురించి ఏమీ చెప్పలేదు.
అయితే ఇంటర్నెట్లో సీక్రెట్ రూమ్ చిత్రాలను చూసి చాలా మంది జోకులు వేశారు.ఇంట్లో దెయ్యం ఉందని కొందరు చెప్పారు.
కొంతమంది సీక్రెట్ రూమ్ చదువుకోవడానికి లేదా విశ్రాంతి తీసుకోవడానికి మంచి ప్రదేశం అని చెప్పారు. సీక్రెట్ రూమ్లో పిల్లలు, భర్తలు కనిపించకుండా దాక్కోవచ్చని ఇంకొందరు సలహా ఇచ్చారు.