ఆ సినిమా వల్ల ప్రశాంత్ నీల్ కు రూ.20 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందా.. ఏమైందంటే?

టాలీవుడ్, శాండిల్ వుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో ప్రశాంత్ నీల్( Director Prashanth Neel ) ఒకరు.ప్రశాంత్ నీల్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా ప్రశాంత్ నీల్ తొలి సినిమా ఉగ్రం అనే సంగతి తెలిసిందే.

 Ugramm Movie Huge Losses To Prashanth Neel Details Here Goes Viral In Social Me-TeluguStop.com

ఈ సినిమాను ప్రశాంత్ నీల్ ఆస్తులు( Prashanth Neel Assets ) అమ్మి నిర్మించడం గమనార్హం.అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత శాటిలైట్ హక్కులు అమ్ముడవకుండానే ఈ సినిమా అప్పట్లో కేబుల్ టీవీలో ప్రసారమైందట.

ఉగ్రమ్ పైరసీ వెర్షన్( Ugram ) ను అప్పట్లో బుల్లితెరపై ప్రసారం చేశారట.ఈ విధంగా చేయడం ద్వారా ప్రశాంత్ నీల్ కు అప్పట్లోనే 20 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని సమాచారం అందుతోంది.

ప్రశాంత్ నీల్ కెరీర్ తొలినాళ్లలో కొన్ని పొరపాట్లు చేసినా ఇప్పుడు ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకునే స్థాయికి ఎదిగారు.

ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్2( Salaar 2 ) స్క్రిప్ట్ పనులలో బిజీగా ఉన్నారు.సలార్1 సినిమా హిట్టైనా కేజీఎఫ్2 రేంజ్ లో హిట్ కాలేదు.భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయకపోవడం సలార్1 మూవీకి భారీ మైనస్ అని ఫ్యాన్స్ ఫీలవుతారు.సలార్2 మూవీకి సంబంధించి రాబోయే రోజుల్లో మరిన్ని అప్ డేట్స్ వస్తాయేమో చూడాల్సి ఉంది.సలార్2 సినిమా మే నెలలో మొదలు కానుండగా వచ్చే ఏడాది మిడిల్ సమయానికి ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంటుంది.సలార్2 సినిమాల్లో మరికొన్ని కొత్త పాత్రల ఎంట్రీ ఉంటుందని సమాచారం.

సలార్2 సినిమా ప్రభాస్ కెరీర్ లో స్పెషల్ సినిమా అవుతుందని ఈ సినిమాలో ట్విస్టుల రివీల్ కు చాలా సమయం పడుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సలార్2 సినిమా బడ్జెట్ 200 కోట్ల రూపాయలు( Salaar Movie Budget ) అని తెలుస్తోంది.సలార్2 సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే బడ్జెట్ రికవరీ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube