ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మొత్తం వారసత్వమే నడుస్తుంది.స్టార్ దర్శకులు సైతం స్టార్ హీరోల వారసులకు మాత్రమే అవకాశాలు ఇస్తున్నారు.
మిగతా చిన్న నటీనటులకు అవకాశాలు తక్కువగా ఉండటమే కాకుండా వారికి ఒక హోదా అనేది లేకుండా పోతుంది.మొత్తం స్టార్ హీరోల కిడ్స్ వైపే దర్శకుడు అవకాశాలు ఇవ్వడంతో చిన్న హీరోలు మొత్తం డౌన్ అయిపోతున్నారు.
నిజానికి చిన్న హీరోలలో చాలా టాలెంట్ ఉంటుందని చెప్పాలి.హీరోలు అవ్వడం కోసం వాళ్ళు ఎన్నో ట్రైనింగులు తీసుకొని మరి ఇండస్ట్రీకి అడుగుపెట్టిన కూడా వాళ్లకు అవకాశాలు ఇవ్వడం లేదు.
కానీ ఏ టాలెంట్ లేని కొంతమంది స్టార్ హీరోల వారసులకు అవకాశాలు ఇచ్చి వారిని పైకి ఎత్తుతున్నారు దర్శకులు.దీంతో జనాలు ఎప్పటికప్పుడు వారిపై విమర్శలు చేస్తూనే ఉంటారు.
అయితే త్వరలో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని గత కొన్ని రోజుల నుండి వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.గతంలో మోక్షజ్ఞ తన తండ్రి నటించిన సినిమాలో నటిస్తాడని వార్తలు కూడా వచ్చాయి.కానీ ఇప్పటివరకు ఆయన మాత్రం ఏ సినిమాలో కూడా నటించలేదు.దీంతో తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి బాలయ్య ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.గతంలో బాలయ్య నటించిన ఆదిత్య 369 సినిమా గురించి అందరికీ తెలిసిందే.ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
దీంతో ఈ సినిమా సీక్వెల్ లో మోక్షజ్ఞ నటించనున్నాడని తెలుస్తుంది.ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయ్యాయని వార్తలు కూడా వచ్చాయి.
దీని గురించి ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ అయితే లేదు.పైగా బాలయ్య బోయపాటి సినిమాలతో మంచి సక్సెస్ లను అందుకోవడంతో అదే సెంటిమెంట్ గా భావించి బోయపాటితో తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఉండాలని అనుకున్నట్లు తెలుస్తుంది.ఇది ఎంతవరకు నిజమో.కాదో.తెలియదు కానీ.మొత్తానికి బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని వార్తలు వైరల్ చేస్తున్నారు.
మరోవైపు బాలయ్య కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.తన సినిమాలను చూసుకుంటూనే తన కొడుకు ఎంట్రీ గురించి ఆలోచిస్తున్నాడు బాలయ్య.
అయితే తాజాగా ట్విట్టర్లో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది.అందులో మోక్షజ్ఞ దగ్గరికి డైరెక్టర్ గోపీచంద్ మలినేని వచ్చి మాట్లాడినట్టు కనిపించాడు.
దీంతో నందమూరి అభిమానులు ఆ వీడియో షేర్ చేస్తూ.త్వరలో తెలుగు రాష్ట్రాలను మోక్షజ్ఞ ఎంట్రీ తో షేక్ చేస్తాడు అంటూ రాసుకొచ్చారు.
దీంతో ఆ వీడియో చూసిన వాళ్లంతా ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు.ఇప్పుడున్న హీరోలకే దిక్కులేదు.
ఎవడ్రా ఈ బుడంకాయ.హీరో క్వాలిటీస్ ఒకటి కూడా లేవు.
అంటూ ఒకరు కామెంట్ చేయగా.ముందు ఆ పొట్టలో ఉన్నది షేక్ చేయండి కరుగుతాయేమో.
అంకుల్ లా ఉన్నాడు.అని కామెంట్ చేస్తున్నారు.