దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో గత దశాబ్ద కాలం క్రితం స్టార్ హీరోయిన్ గా కొనసాగిన వారిలో నటి త్రిష ఒకరు.ఈమె తెలుగు తమిళ చిత్రాలతో ఎంతో బిజీగా ఉంటూ ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.
ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి నుంచి టాలీవుడ్ స్టార్ హీరోలందరితో ఎంతో అద్భుతమైన చిత్రాల్లో నటించిన త్రిషకు క్రమక్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి.ఇలా అవకాశాలు తగ్గిపోవడంతో ఈమె కమర్షియల్ చిత్రాలలో కాకుండా లేడి ఓరియెంటెడ్ చిత్రాల ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
లేడీ ఓరియెంటెడ్ చిత్రాల ద్వారా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్న త్రిషకు ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేకున్నప్పటికీ తమిళంలో అడపాదడపా అవకాశాలు వస్తున్నాయి.
త్రిష స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో ఈమె గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
తమిళ హీరో విజయ్ తో డేటింగ్ లో ఉందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అలాగే టాలీవుడ్ హీరోలు రానా, ప్రభాస్ వంటి హీరోలతో కూడా ఈమెకు లవ్ ఎఫైర్స్ ఉన్నాయని గతంలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.
ఇలా త్రిష స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో ఈమె గురించి ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టినప్పటికీ వాటిలో ఏది నిజం లేదని తెలిసిపోయింది.
ఇదిలా ఉండగా త్రిష తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో హైదరాబాద్ లో సొంతంగా ఒక స్టార్ హోటల్ ను నిర్మించినట్లు పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేశాయి.
త్వరలోనే ఈమె ఫైవ్ స్టార్ హోటల్ యజమానిగా మారబోతోంది అంటూ గతంలో ఈమె గురించి ఇలాంటి వార్త వినిపించింది.త్రిష తండ్రి కృష్ణన్ హోటల్ మేనేజ్ మెంట్ లో బాగా అనుభవం ఉండటం వల్ల సొంతంగా హోటల్ నిర్మించాలని భావించారు.
ఇలా ఈమె నిర్మించబోతున్న హోటల్ లో తన తండ్రి బాధ్యతలు తీసుకోబోతున్నారని గతంలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.

ఇక త్రిష ప్రారంభించిన ఈ హోటల్ లో కేవలం తన హస్తం మాత్రమే కాకుండా కొందరు ప్రముఖ రాజకీయ నాయకులు అలాగే సెలబ్రిటీలు కూడా ఈ హోటల్ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నారని,ఈ హోటల్ ప్రారంభోత్సవానికి కూడా ఎంతో మంది అతిథులు హాజరు కాబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ ఈమె మాత్రం హైదరాబాద్ లో ఎలాంటి హోటల్ నిర్వహించలేదని, తన గురించి వస్తున్న ఇలాంటి వార్తలు అన్నీ కూడా కేవలం పుకార్లు మాత్రమేనని త్రిష కొట్టిపారేశారు.ఇక ప్రస్తుతం ఈమె సినిమాల విషయానికి వస్తే తెలుగులో ఎలాంటి అవకాశాలు లేకపోయినా తమిళంలో మాత్రం అడపాదడపా అవకాశాలు వస్తున్న విజయం సాధించలేకపోతున్నాయి.