ట్రాయ్ కొత్త రూల్స్: తక్కువ ధరకే ఎక్కువ ఛానల్స్...!

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కేబుల్ టీవీ, డిటిహెచ్ యూజర్లకు శుభవార్తను తెలిపింది.రాబోయే కాలంలో తక్కువ ధరకే ఎక్కువ ఛానల్స్ లభించే విధంగా రూల్స్ తీసుక రాబోతోంది.ఇందుకు సంబంధించి తాజాగా ట్రాయ్ న్యూ టారిఫ్ ఆర్డర్ 2.0 ను అమలు చేయబోతోంది.అయితే ఇందుకు పూర్తి వివరాలు ఒక సారి చూస్తే.ఛానళ్లను సబ్ స్క్రైబర్స్ సెలెక్ట్ చేసుకోడానికి వినియోగదారులకు స్వేచ్ఛను ఇచ్చే పలు నిర్ణయాలను తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

 Trai, Subscribers, Tv, Channels, August-TeluguStop.com

అయితే ఇదే విషయంపై తాజాగా మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది ట్రాయ్.ఈ కొత్త రూల్స్ ప్రకారం సబ్ స్క్రైబర్స్ కు మరింత భారం తగ్గనుంది.

ఈ కొత్త రూల్స్ ఆగస్టు 10 లోపలే అమల్లోకి రానున్నాయి.ఇదివరకు సబ్ స్క్రైబర్స్ రూ.130 చెల్లిస్తే 100 ఛానల్స్ వరకు చూసే అవకాశం ఉండేది.ఇక ఈ కొత్త రూల్స్ ప్రకారం ఏకంగా 100 నుండి 200 ఛానల్ చూసే అవకాశం లభించకపోతుంది సబ్ స్క్రైబర్స్ కి.

ఇదివరకు ఒక ఛానల్ వీక్షించడానికి గరిష్టంగా ఉన్న రూ.19 ని చెల్లిస్తుండగా, తాజాగా దానిని రూ.12 కు చేసింది ట్రాయ్.ఇందుకు సంబంధించి కొత్త వివరాలు ఆగస్టు 10 లోగా ప్రతికేబుల్ టీవీ లేదా డిటిహెచ్ ఆపరేటర్ల వెబ్ సైట్స్ ఉండబోతున్నాయని తెలియజేసింది.

ఇకపోతే ఈ విషయంపై ట్రాయ్ తీసుకున్న నిర్ణయాలపై ప్రస్తుతం బ్రాడ్ కాస్టర్ లలో కొంత ఆందోళన కొట్టొచ్చినట్లు కనబడుతోంది.గత సంవత్సరం ఫిబ్రవరిలో న్యూ టారిఫ్ ఆర్డర్ ని అమలులోకి తీసుకు వచ్చినప్పటి నుండి వినియోగదారులు తాము చూసే ఛానల్ కి మాత్రమే ఇస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.

దీంతో సబ్ స్క్రైబర్ ఏ ఛానల్ చూడాలనుకుంటున్నారో కేవలం వాటికి మాత్రమే అదనంగా డబ్బులు చెల్లించే వెసులుబాటు కల్పించింది ట్రాయ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube