పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది.సబ్బితం వాటర్ ఫాల్స్ వద్ద ప్రమాదవశాత్తు నీళ్లలోపడి యువకుడు మృతిచెందాడు.
ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జలపాతాల అందాలను వీక్షించడానికి వెళ్లి మృత్యువాత పడ్డాడని తెలుస్తోంది.మృతుడు కరీంనగర్ జిల్లాకు చెందిన వెంకటేశ్ గా గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుని మృతదేహాం కోసం గాలిస్తున్నారు.