ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న వార్తలు జోరుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తాజాగా తుమ్మలతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక సమావేశం అయ్యారు.
ఇందులో భాగంగా తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.కాగా ఈ భేటీలో రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.
అయితే తెలంగాణలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే.పాలేరు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన తుమ్మలకు ఈ జాబితాలో చోటు దక్కకపోవడంతో ఆయన బీఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉన్నారు.
ఈ క్రమంలోనే పాలేరు నుంచే ఎలా అయినా పోటీ చేస్తానంటూ ప్రకటన కూడా చేశారు.ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆయనను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు.
అయితే తుమ్మల ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.