దేశంలో వాహనాలు ఎక్కువగా దొంగతనం జరిగేది అక్కడే.. ఆ కలర్ కార్లపైనే దొంగలు మోజు..

భారతదేశంలో ఇతర దేశాలలో లాగానే దొంగతనాలు అధికంగానే జరుగుతుంటాయి.ముఖ్యంగా వాహనాల దొంగతనం ఇండియాలో కాస్త ఎక్కువే.

 Top 5 Most Stolen Bikes And Cars In India Details, Acko Report, Vehicle Theft, V-TeluguStop.com

ఇంటి ముందు లేదా ఏదైనా పబ్లిక్ ప్లేస్‌లో పెడితే చాలు వాటిని రాత్రికి రాత్రి మాయం చేసే కేటుగాళ్లు ఇండియాలోని ప్రతి నగరంలో ఉన్నారు.

తాజాగా వాహనాల చోరీలకు సంబంధించి ఒక నివేదిక ఆసక్తికర విషయాలు బయట పెట్టింది.

ఇన్సూరెన్స్ కంపెనీ అకో నివేదిక ప్రకారం భారత్‌లో 56 శాతం కంటే ఎక్కువ వెహికల్ చోరీలు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోనే జరుగుతున్నాయి.అంటే ఇక్కడ వాహనాలు నిలిపితే ఎంత ప్రమాదం అర్థం చేసుకోవచ్చు.

ఆ నివేదిక ప్రకారం ఎక్కువగా దొంగతనానికి గురైన కార్లలో మారుతి సుజుకి వ్యాగన్ ఆర్, మారుతి సుజుకి స్విఫ్ట్ ఉండటం విశేషం.ఇక బైక్‌లలో హీరో స్ప్లెండర్‌ ఎక్కువగా దొంగతనానికి గురైంది.

అత్యధికంగా చోరీకి గురైన టాప్ 5 కార్లు, బైక్‌ల గురించి తెలుసుకుంటే.

Telugu Acko, Delhi, India, Stolen, Stolen Cars, Wheelers, Vehicle Theft-Latest N

• టాప్ 5 కార్లు

హోండా సిటీ, హ్యుందాయ్ క్రెటా, హ్యుందాయ్ శాంత్రో, హ్యుందాయ్ ఐ10

• టాప్‌ 5 టూ-వీలర్స్

హీరో స్ప్లెండర్, హోండా యాక్టివా, బజాజ్ పల్సర్, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, టీవీఎస్ అపాచీ

Telugu Acko, Delhi, India, Stolen, Stolen Cars, Wheelers, Vehicle Theft-Latest N

అయితే ఇక్కడ ఒక విశేషమేంటంటే.దొంగలు ఎక్కువగా తెల్ల కలర్ కార్లనే కొట్టేస్తున్నారు.ఇకపోతే భారత రాజధాని ఢిల్లీలో హిణి, భజన్‌పురా, దయాల్‌పూర్, సుల్తాన్‌పురి, ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్, ఉత్తర ప్రాంతాలలో దొంగలు తమ చేతులకు ఎక్కువగా పని చెబుతుంటారు.

నోయిడాలోని సెక్టార్ 12, పశ్చిమాన ఉత్తమ్ నగర్, గురుగ్రామ్‌లోని సౌత్ సిటీ Iలలో కూడా వాహనాలు చోరీకి గురవుతుంటాయి.ఇక దేశంలోనే అతి తక్కువ వాహనాల చోరీలు జరిగే నగరాలుగా హైదరాబాద్, ముంబై, కోల్‌కతా ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube