దేశంలో వాహనాలు ఎక్కువగా దొంగతనం జరిగేది అక్కడే.. ఆ కలర్ కార్లపైనే దొంగలు మోజు..

భారతదేశంలో ఇతర దేశాలలో లాగానే దొంగతనాలు అధికంగానే జరుగుతుంటాయి.ముఖ్యంగా వాహనాల దొంగతనం ఇండియాలో కాస్త ఎక్కువే.

ఇంటి ముందు లేదా ఏదైనా పబ్లిక్ ప్లేస్‌లో పెడితే చాలు వాటిని రాత్రికి రాత్రి మాయం చేసే కేటుగాళ్లు ఇండియాలోని ప్రతి నగరంలో ఉన్నారు.

తాజాగా వాహనాల చోరీలకు సంబంధించి ఒక నివేదిక ఆసక్తికర విషయాలు బయట పెట్టింది.

ఇన్సూరెన్స్ కంపెనీ అకో నివేదిక ప్రకారం భారత్‌లో 56 శాతం కంటే ఎక్కువ వెహికల్ చోరీలు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోనే జరుగుతున్నాయి.

అంటే ఇక్కడ వాహనాలు నిలిపితే ఎంత ప్రమాదం అర్థం చేసుకోవచ్చు.ఆ నివేదిక ప్రకారం ఎక్కువగా దొంగతనానికి గురైన కార్లలో మారుతి సుజుకి వ్యాగన్ ఆర్, మారుతి సుజుకి స్విఫ్ట్ ఉండటం విశేషం.

ఇక బైక్‌లలో హీరో స్ప్లెండర్‌ ఎక్కువగా దొంగతనానికి గురైంది.అత్యధికంగా చోరీకి గురైన టాప్ 5 కార్లు, బైక్‌ల గురించి తెలుసుకుంటే.

"""/"/ H3 Class=subheader-style• టాప్ 5 కార్లు/h3p హోండా సిటీ, హ్యుందాయ్ క్రెటా, హ్యుందాయ్ శాంత్రో, హ్యుందాయ్ ఐ10 H3 Class=subheader-style• టాప్‌ 5 టూ-వీలర్స్/h3p హీరో స్ప్లెండర్, హోండా యాక్టివా, బజాజ్ పల్సర్, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, టీవీఎస్ అపాచీ """/"/ అయితే ఇక్కడ ఒక విశేషమేంటంటే.

దొంగలు ఎక్కువగా తెల్ల కలర్ కార్లనే కొట్టేస్తున్నారు.ఇకపోతే భారత రాజధాని ఢిల్లీలో హిణి, భజన్‌పురా, దయాల్‌పూర్, సుల్తాన్‌పురి, ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్, ఉత్తర ప్రాంతాలలో దొంగలు తమ చేతులకు ఎక్కువగా పని చెబుతుంటారు.

నోయిడాలోని సెక్టార్ 12, పశ్చిమాన ఉత్తమ్ నగర్, గురుగ్రామ్‌లోని సౌత్ సిటీ Iలలో కూడా వాహనాలు చోరీకి గురవుతుంటాయి.

ఇక దేశంలోనే అతి తక్కువ వాహనాల చోరీలు జరిగే నగరాలుగా హైదరాబాద్, ముంబై, కోల్‌కతా ఉన్నాయి.

వైరల్ వీడియో: ఒంటి చేత్తో 90 లక్షల విలువైన క్యాచ్ ను పట్టుకున్న వీక్షకుడు