చవగ్గా కొన్న టాప్‌-10 స్టాక్స్‌... అత్యధిక లాభాలు పొందిన రిటైల్‌ ఇన్వెస్టర్లు!

FIIs (ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు) మన స్టాక్‌ మార్కెటలో భారీగా అమ్మకాలకు దిగడంతో, ఇండియన్‌ ఈక్విటీలు కాస్త చౌకగా మారాయని చెప్పొచ్చు.దాంతో రిటైల్ ఇన్వెస్టర్లు కొన్ని స్టాక్స్‌ను పోటీపడి మరీ కొంటున్నారు.

 Top-10 Stocks Bought Cheaply Retail Investors Who Got Highest Profits Details, S-TeluguStop.com

దాంతో రిటైల్‌ ఇన్‌ ఫ్లోస్‌ నిరాటంకంగా కొనసాగుతోంది.డిసెంబర్‌ త్రైమాసికంలో చూసుకుంటే, దలాల్ స్ట్రీట్‌లోని 3 న్యూ-ఏజ్‌ టెక్నాలజీ కంపెనీల్లో రిటైల్‌ ఇన్వెస్టర్లు భారీగా బెట్టింగ్స్‌ వేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.కేవలం 3 కంపెనీల్లోనే ‍FSN ఈ-కామర్స్ వెంచర్స్ ‍‌(నైకా), ఈజీ ట్రిప్ ప్లానర్స్‌, వన్97 కమ్యూనికేషన్స్‌లో (పేటీఎం) రూ.10,261 కోట్ల విలువైన షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లు కొనుగోలు చేయడం విశేషం.

Telugu Bajaj Finserv, Cheap, Trips Planners, Tips, Landt Mind Tree, Nykaa, Paytm

ఈ మొత్తంలో సగానికి పైగా వాటాను అంటే రూ.5,416 కోట్లు నైకా షేర్ల కొనుగోలు కోసం ఖర్చు పెట్టడం విశేషంగా చెప్పుకోవచ్చు.రిటైల్ హోల్డింగ్ సెప్టెంబర్‌ త్రైమాసికం కంటే డిసెంబర్ త్రైమాసికంలో 8 రెట్లు పెరిగి 10.2 కోట్ల షేర్లకు చేరుకోవడం విశేషం.న్యూ-ఏజ్‌ టెక్నాలజీ కంపెనీలలో చిన్న మదుపుదార్లు నికరంగా రూ.3,749 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.దీంతో, ఈ కంపెనీలో రిటైల్‌ హోల్డింగ్ దాదాపు 9 రెట్లు QoQ పెరిగి 17.4 కోట్ల షేర్లకు చేరుకుంది.ఈ ఫిన్‌టెక్ మేజర్‌లో వారి మొత్తం హోల్డింగ్ QoQలో 45% పెరిగి 6 కోట్ల షేర్లకు చేరుకుంది.రిటైల్ ఇన్వెస్టర్లే కాకుండా మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈ 3 స్టాక్స్‌లో కొనుగోళ్లను పెంచుతున్నాయి.

Telugu Bajaj Finserv, Cheap, Trips Planners, Tips, Landt Mind Tree, Nykaa, Paytm

గత 3 త్రైమాసికాలుగా చూసుకుంటే వన్97 కమ్యూనికేషన్స్, FSN ఈ-కామర్స్‌లో తమ యాజమాన్యాన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ పెంచుకున్నాయి.ఇక డిసెంబర్ త్రైమాసికంలో పేటీఎం, నైకా షేర్లు వరుసగా వరుసగా 17%, 27% నష్టపోవడం కొసమెరుపు.కాగా ఈజీ ట్రిప్ ప్లానర్స్ 12% మేర లాభపడింది.న్యూ-ఏజ్ టెక్ కంపెనీలతో పాటు.మూడో త్రైమాసికంలో రిటైల్ ఇన్వెస్టర్లు చేసిన టాప్ 10 కొనుగోళ్లలో బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, టాటా ఎల్‌క్సీ, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్, స్టీల్ స్ట్రిప్స్ వీల్స్‌, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ ఉండటం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube