ప్రస్తుతం నందమూరి తారక రామారావు( Nandamuri Taraka Ramarao ) శత జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న విషయం మనం అందరికీ తెలిసిందే.కాగా ఇటీవలే విజయవాడలో టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభకు తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ కూడా గెస్ట్‌గా హాజరై, అన్న గారితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.
అయితే ఈ కార్యక్రమానికి కేవలం బాలకృష్ణ మాత్రమే హాజరయ్యారు.
కాగా ఆ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ వస్తారని భావించినప్పటికీ వారికి ఆహ్వానం అందలేదని తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే ఈ శత జయంతి ఉత్సవాల్లో భాగంగానే మే 20న హైదరాబాద్, కేపీహెచ్‌బీలో వేడుకలకు ప్లాన్ చేశారు.దీనికి బాలకృష్ణ, ఎన్టీఆర్ ( Balakrishna NTR ) సహా పలువురు టాలీవుడ్ హీరోలు హాజరుకానున్నారు.
ఆ హీరోలు ఎవరు అన్న విషయానికి వస్తే.ఈ వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, వెంకటేష్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికలు తెగ వైరల్ అవుతున్నాయి.వీరందరికీ ఎన్టీఆర్ సావనీర్ కమిటీ ఛైర్మన్, టీడీపీ నేత టీడీ జనార్థన్ ఆహ్వానించారు.ఈ కార్యక్రమానికి అగ్ర హీరోలు అయిన చిరంజీవి, నాగార్జునతో పాటు మహేష్ బాబు మాత్రం అటెండ్ కావడం లేదని తెలుస్తోంది.
అయితే దగ్గుబాటి పురంధేశ్వరి సహా నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ ఉత్సవాల నిర్వహణ కమిటీ ఆహ్వానాలు పంపించింది.ఇదిలా ఉంటే, టాలీవుడ్ స్టార్ హీరోలందరినీ ఒకే స్టేజిపై చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.చిరంజీవి నాగార్జున మహేష్ బాబు ఈ కార్యక్రమానికి ఎందుకు హాజరు కావడం లేదు అన్న చర్చల మొదలయ్యాయి.
మొత్తానికి ఎన్టీఆర్ శత దినోత్సవ వేడుకలు మాత్రం చాలా ఘనంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు.