తెలుగు సినిమా ప్రేక్షకులకు నందమూరి తారక రామారావు( Nandamuri Taraka Rama Rao ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శత జయంతి ఉత్సవాలను తెలుగువారు ఘనంగా నిర్వహించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ఖమ్మంలో దాదాపు 54 అడుగులు ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించారు.మే 28న ఆయన శత జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు ప్లాన్ చేశారు.
ఈ విగ్రహం కృష్ణుడి రూపంలో ఉండడంతో టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి( Karate Kalyani ) తీవ్రంగా వ్యతిరేకించడంతోపాటు మీడియా ఛానల్లో డిబేట్లు పెట్టి మరి నానా రచ్చ చేస్తోంది.కృష్ణుడికి రూపం లేదా మానవ రూపంలోనే కొలవాలా అంటూ లీగల్గా ప్రశ్నిస్తూ ప్రొసీడ్ అవుతున్నట్టు తెలిపింది.ఈ విషయం పట్ల విశ్వహిందూ పరిషత్ ఇస్కాన్ తదితర సంస్థలు కరాటే కళ్యాణికి మద్దతుగా నిలిచాయి.ఇకపోతే ఈ వివాదం పై విచారించిన హైకోర్టు తాజాగా స్టే విధించింది అని కళ్యాణి తన ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ చేసింది.
ఇప్పుడే తీర్పు ఇచ్చారు 28న విగ్రహం పెట్టకూడదని కోర్టులో జడ్జిగారు మనకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు.
జై శ్రీ కృష్ణ.నువ్వు ఉన్నావు స్వామి అంటూ కళ్యాణి తన పోస్టులో రాసుకొచ్చింది.దీంతో ఈనెల 28న ఆవిష్కరించనున్న ఎన్టీఆర్ విగ్రహానికి బ్రేక్ పడినట్లు అయింది.
కరాటే కళ్యాణి ఈ విగ్రహం విషయంలో వ్యక్తం చేయడంతో చాలామంది ఆమెకు మద్దతుగా మాట్లాడుతుండగా మరికొందరు మాత్రం ఆమెపై నెగటివ్ గా కామెంట్స్ చేస్తూ ఆమెను తప్పుపడుతున్నారు.మొత్తానికి ఈ వివాదంలో కరాటే కళ్యాణి గెలిచిందని చెప్పవచ్చు.
మరి 28వ విగ్రహావిష్కరణ కొనసాగిస్తారా లేదంటే ఇంతటితో ఆపేస్తారా అన్నది చూడాలి మరి.