హైకోర్ట్ తీర్పుపై అలాంటి వాఖ్యలు చేసిన కరాటే కళ్యాణి.. కృష్ణా నువ్వు వున్నావు స్వామి అంటూ?

తెలుగు సినిమా ప్రేక్షకులకు నందమూరి తారక రామారావు( Nandamuri Taraka Rama Rao ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శత జయంతి ఉత్సవాలను తెలుగువారు ఘనంగా నిర్వహించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఖమ్మంలో దాదాపు 54 అడుగులు ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించారు.

మే 28న ఆయన శత జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు ప్లాన్ చేశారు.

"""/" / ఈ విగ్రహం కృష్ణుడి రూపంలో ఉండడంతో టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి( Karate Kalyani ) తీవ్రంగా వ్యతిరేకించడంతోపాటు మీడియా ఛానల్లో డిబేట్లు పెట్టి మరి నానా రచ్చ చేస్తోంది.

కృష్ణుడికి రూపం లేదా మానవ రూపంలోనే కొలవాలా అంటూ లీగల్గా ప్రశ్నిస్తూ ప్రొసీడ్ అవుతున్నట్టు తెలిపింది.

ఈ విషయం పట్ల విశ్వహిందూ పరిషత్ ఇస్కాన్ తదితర సంస్థలు కరాటే కళ్యాణికి మద్దతుగా నిలిచాయి.

ఇకపోతే ఈ వివాదం పై విచారించిన హైకోర్టు తాజాగా స్టే విధించింది అని కళ్యాణి తన ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ చేసింది.

ఇప్పుడే తీర్పు ఇచ్చారు 28న విగ్రహం పెట్టకూడదని కోర్టులో జడ్జిగారు మనకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు.

"""/" / జై శ్రీ కృష్ణ.నువ్వు ఉన్నావు స్వామి అంటూ కళ్యాణి తన పోస్టులో రాసుకొచ్చింది.

దీంతో ఈనెల 28న ఆవిష్కరించనున్న ఎన్టీఆర్ విగ్రహానికి బ్రేక్ పడినట్లు అయింది.కరాటే కళ్యాణి ఈ విగ్రహం విషయంలో వ్యక్తం చేయడంతో చాలామంది ఆమెకు మద్దతుగా మాట్లాడుతుండగా మరికొందరు మాత్రం ఆమెపై నెగటివ్ గా కామెంట్స్ చేస్తూ ఆమెను తప్పుపడుతున్నారు.

మొత్తానికి ఈ వివాదంలో కరాటే కళ్యాణి గెలిచిందని చెప్పవచ్చు.మరి 28వ విగ్రహావిష్కరణ కొనసాగిస్తారా లేదంటే ఇంతటితో ఆపేస్తారా అన్నది చూడాలి మరి.