తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సీనియర్ నటి ప్రభ(Prabha) తన కుమారుడి వివాహ వేడుకలను ఎంతో ఘనంగా జరిపించారు.హైదరాబాదులో తన కుమారుడు రాజా రమేష్ (Raja Ramesh) వివాహ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి.
గండిపేట గోల్కోండ రిసార్ట్స్‌లో ఈ వేడుక జరిగింది.సినీ రంగ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు హాజరై సందడి చేశారు.
రాజా రమేష్ విజయవాడకు చెందిన సాయి అపర్ణ (Sai Aparna) అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.

ఇలా వీరి వివాహ వేడుక హైదరాబాద్లో జరగడంతో పెద్ద ఎత్తున టాలీవుడ్ సెలబ్రిటీలు (Tollywood Stars) హాజరయ్యారు అలాగే పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ పెళ్లి వేడుకలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరోలైనటువంటి వెంకటేష్,(Venkatesh) మెగాస్టార్ చిరంజీవి,(Megastar Chiranjeevi) మురళీమోహన్, ఎస్వీ కృష్ణారెడ్డి, బోయపాటి శీను, బెల్లంకొండ సురేష్ వంటి తదితరులు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ విధంగా సినిమా సెలబ్రిటీలతో పాటు రాజకీయం నాయకులు కూడా ఈ పెళ్లి వేడుకలలో సందడి చేశారు.

ప్రభ రమేష్ దంపతుల ఏకైక సంతానం రాజా రమేష్ వృత్తిపరంగా అమెరికాలో స్థిరపడ్డారు.ప్రభ భర్త రమేష్ గత కొంతకాలం క్రితం మరణించారు అప్పటినుంచి ప్రభ తన కొడుకును చదివిస్తూ ఎంతో ఉన్నత స్థాయిలో ఉండేలా తీర్చిదిద్దారు.ప్రస్తుతం ఈయనకు విజయవాడకు చెందిన సాయి అపర్ణతో వివాహం జరిగింది.ప్రస్తుతం ఈ వివాహ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇకపోతే ప్రభ సౌత్ ఇండస్ట్రీలో దాదాపు 100 సినిమాలకు పైగా నటించి ప్రేక్షకులను మెప్పించారు.ఈమె తెలుగులో మొట్టమొదటిసారి.
నీడలేని ఆడది అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.