రాజకీయాల్లో మార్పులు చేర్పులు సహజం..: మంత్రి పెద్దిరెడ్డి

రాజకీయాల్లో మార్పులు చేర్పులు సహజమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.సీఎం వైఎస్ జగన్ తమ నాయకుడన్న పెద్దిరెడ్డి ఆయన కోసం తాము ఎప్పటికీ పని చేస్తూనే ఉంటామని తెలిపారు.

 Changes And Additions Are Natural In Politics..: Minister Peddireddy-TeluguStop.com

కాంగ్రెస్, టీడీపీలు ఎన్ని వచ్చినా తాము తమ సీఎం జగన్ వెంటే నడుస్తామని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.కుటుంబాలను చీల్చి రాజకీయం చేసే నైజం సోనియాగాంధీ, చంద్రబాబుదని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

ఏపీలో జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.కాంగ్రెస్ లో ఎవరు ఉన్నా తమ పార్టీకి వ్యతిరేకంగా ఉంటే ప్రత్యర్థిగానే చూస్తామన్న మంత్రి పెద్దిరెడ్డి జెడ్పీటీసీగా ఓడిన వ్యక్తిని తాము ఎమ్మెల్యేగా గెలిపించామన్నారు.

ఇటువంటివి మాట్లాడే ముందు ఆలోచన చేయాలని చెప్పారు.ఎవరో రెచ్చగొడితే అలా మాట్లాడటం సబబు కాదని తెలిపారు.

ఇప్పటికైనా ఎంఎస్ బాబు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube