2021: ఈ ఏడాది ఆకట్టుకున్న కోర్టు సీన్ డ్రామా సినిమాలేంటో తెలుసా?

ఆయా సినిమాల్లో కోర్టు సీన్లు ఎప్పుడూ జనాలను ఆకట్టుకుంటూనే ఉంటాయి.చాలా సినిమాలు కోర్టు రూమ్ డ్రామాలుగా తెరకెక్కి సక్సెస్ సాధించాయి కూడా.

 Tollywood Court Scenes Highlets In 2021 Details, Tollywood Court Scenes, 2021, T-TeluguStop.com

చక్కటి కథలు.వాటికి చక్కటి ఎమోషన్స్ తోడై మంచి జనాదరణ దక్కించుకుంటూనే ఉన్నాడు.

చేయని తప్పుకు జైలు పాలైన అమాయకుల తరుపున.లేదంటే తప్పు చేసి బయట తిరుగుతున్న వారని బొక్కలో తోయించేలా న్యాయవాదులు కోర్టుల్లో వాదించే తీరు బాగా ఆకట్టుకుంటుంది.

ఉత్కంఠగా కొనసాగే ఈ సినిమాలు ఈ ఏడాది కూడా జనాలను ఆకట్టుకున్నాయి.ఇంతకీ ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వకీల్ సాబ్

బాలీవుడ్ రీమేక్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా పవర్ స్టార్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది.రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి హైద్రాబాద్ కు వస్తారు ముగ్గురు అమ్మాయిలు.

అంతా కలిసి ఓ హాస్టల్లో ఉంటారు.వారి ఫ్రెండ్స్ అయిన కొందరు అబ్బాయిల మూలంగా ఓ గొడవలో చిక్కుకుంటారు.

వారి జీవితాలు రోడ్డున పడే అవకాశం ఉంటుంది.ఆ పంచాయితీ కోర్టుకు చేరుతుంది.

ఆ పరిస్థితుల్లో అమ్మాయిలకు అండగా నిలుస్తాడు సత్యదేవ్ అనే లాయర్.వారికి న్యాయం చేయడంలో పవన్ కల్యాణ్ ఎలా సక్సెస్ అయ్యాడు అనేది ఈ సినిమా.ఈ సినిమాలో వచ్చే ప్రతి కోర్టు సీన్ అద్భుతం అని చెప్పుకోవచ్చు.

జైభీమ్

Telugu Allari Naresh, Jai Bheem, Naandi, Nithin, Pawan Kalyan, Satyadev, Surya,

తాజాగా విడుదలై సంచలన విజయం సాధించిన సినిమా ఇది.చంద్రు అనే లాయర్ నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.చేయని నేరానికి ముగ్గురు గిరిజన యువకులు కనిపించకుండా పోతారు.

వారిలో ఒకరి భార్య తనకు న్యాయం చేయాలని కోర్టుమెట్లు ఎక్కుతుంది.ఆ పరిస్థితుల్లో చంద్రు అనే లాయర్ ఈ కేసును వాదించి ఎలా ఆమెకు న్యాయం చేస్తాడు అనేది ఈ సినిమా కథ.సూర్య ఈ సినిమాలో న్యాయవాది చంద్రుగా నటించి మెప్పించాడు.

నాంది

Telugu Allari Naresh, Jai Bheem, Naandi, Nithin, Pawan Kalyan, Satyadev, Surya,

అల్లరి నరేశ్ నటించిన ఈ సినిమాలోని కోర్టు రూమ్ సీన్లు బాగా ఆకట్టుకుంటాయి.హత్య కేసులో ప్రధాన నిందితుడిగా కోర్టు మెట్లు ఎక్కిన ఒక యువకుడి తరపున ఒక లాయర్ నిలబడుతాడు.అతడిని నిర్దోషిగా నిరూపించడంలో ఎలా సక్సెస్ అవుతాడు అనేదే ఈ సినిమా.ముద్దాయిగా నరేష్, లాయర్ గా వరలక్ష్మి శరత్ కుమార్ అద్భుతంగా నటించారని చెప్పుకోవచ్చు.

తిమ్మరుసు

Telugu Allari Naresh, Jai Bheem, Naandi, Nithin, Pawan Kalyan, Satyadev, Surya,

సత్యదేవ్ హీరోగా నటించిన ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది.మర్డర్ ను చూసిన ఒక యువకుడిని అదే కేసులో నిందితుడిగా ఇరికించే ప్రయత్నం చేస్తారు కొందరు.అతడి తరుఫున రామచంద్ర అనే లాయర్ కేసు వాదిస్తాడు.

చివరకు ఆ యువకుడిని బయటపడేలా చేస్తాడు.ఈ సినిమా కూడా జనాలకు బాగా ఎక్కింది.

చెక్

Telugu Allari Naresh, Jai Bheem, Naandi, Nithin, Pawan Kalyan, Satyadev, Surya,

నితిన్ హీరోగా చేసిన ఈ సినిమా కూడా కోర్టు డ్రామాగా తెరకెక్కింది.చేయని నేరానికి జైలు పాలైతాడు ఓ యువకుడు.చదరంగంలో గ్రాండ్ మాస్టర్ గా ఎదిగి ఎలా బయటపడతాడు అనేది సినిమా కథ.ఈ సినిమాలో నితిన్ నటన బాగా ఆకట్టుకుంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube