RRR షూట్ నుండి రయ్ మంటూ వెళ్తున్న చరణ్, తారక్..పిక్ వైరల్!

దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమా ఆర్ ఆర్ ఆర్.ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

 Tiger And Cheetah Leaving The Set Rrr Ram Charan And Tarak-TeluguStop.com

ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఈ సినిమా కోసం మూడు సంవత్సరాలుగా కష్టపడుతున్నారు.రాజమౌళి సినిమాలంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒక్కో సినిమా సంవత్సరాలు సమయం తీసుకుంటాడు.ఆ సినిమా షూటింగ్ పూర్తి అయ్యే వరకు వేరొక సినిమాలో నటించడానికి రాజమౌళి ఒప్పుకోదు.

దీంతో హీరోలు కూడా రాజమౌళికి కావలసినంత సమయం ఇస్తారు.

RRR షూటింగ్ స్టార్ట్ అయ్యింది మూడు సంవత్సరాలు అవుతుంది.

మధ్యలో కరోనా రావడంతో ఈ సినిమా ఆలస్యం అయ్యింది.ఎట్టకేలకు నిన్న RRR షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేసాడు రాజమౌళి.

దీంతో చరణ్ తారక్ లు ఇద్దరు బందిఖానా నుండి బయటపడి స్వేచ్ఛగా విహరిస్తూ కనిపించారు.ఇప్పుడు ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ వీడియోలో ఎన్టీఆర్ తన కొత్త లంబోర్ఘిని కార్ లో RRR సెట్స్ నుండి వెళ్తుంటే ఆ వెనకనే రామ్ చరణ్ తన రెడ్ కలర్ ఫెరారీ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ వెళ్లిన దృశ్యాలు ఈ వీడియో కనిపిస్తున్నయి.ఖరీదైన కార్లలో రయ్యి మంటూ వెళ్తున్న వీరిద్దరి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.వీరిద్దరి తమ చిరి షాట్ పూర్తి చేసిన తర్వాత RRR సెట్స్ నుండి బయలుదేరి వెళ్లిపోయారు.

టీమ్ RRR ఇంస్టాగ్రామ్ పేజీలో ఈ వీడియోను షేర్ చేసారు.”టైగర్.చీటా.

ఈ రోజు చివరి షాట్ పూర్తి చేసి సెట్ నుండి నిష్క్రమించాయి!” అంటూ ఈ వీడియోను షేర్ చేసింది.ఈ సినిమా పికప్ షాట్స్ మినహా మిగతా షూట్ మొత్తం పూర్తి చేసినట్టు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.

త్వరలోనే మరికొన్ని అప్డేట్ లు అందిస్తామని మేకర్స్ తెలిపారు.RRR అక్టోబర్ 13 న కూడా రిలీజ్ అయ్యే ఛాన్సులు కనిపించడం లేదు కాబట్టి.

కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని టాక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube