వ్యాక్సిన్ తీసుకున్న వారు అప్ప‌టి నుంచి అమెరికాలోకి వెళ్లొచ్చ‌ట‌..

క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌పంచం ఎంత‌లా అత‌లాకుత‌లం అయిందో అంద‌రికీ తెలిసిందే.గ‌తంలో ఎన్న‌డూ లేన‌న్ని నిబంధ‌న‌లు అమ‌లులోకి వ‌చ్చాయి.

 Those Who Have Been Vaccinated Have Since Moved To The United States , United St-TeluguStop.com

అంత‌కుముందు ఎలాంటి ఆంక్ష‌లు లేకుండా ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్లిన జ‌నాలు ఆ త‌ర్వాత ఒక ప్రాంతం నుంచి మ‌రో ప్రాంతానికి వెళ్లాలంటే ఎన్ని ర‌కాల నిబంధ‌న‌లు పాటించాల్సి వ‌స్తుందో చూస్తూనే ఉన్నాం.ఇప్ప‌టికే కొన్ని దేశాలు అయితే కేసులు ఎక్కువ‌గా ఉన్న దేశాల నుంచి జ‌నాల‌ను రానివ్వ‌కుండా అడ్డుకుంటున్న విష‌యం కూడా మ‌నంద‌రికీ విదిత‌మే.

ఇక అమెరికా అయితే ఎన్నో ర‌కాల ఆంక్ష‌లు పెట్టింది.చాలా ర‌కాల రూల్స్ ను పెట్టి అవ‌న్నీ పాటిస్తేనే త‌మ దేశంలోకి రానివ్వాలంటూ ఆదేశాలు కూడా ఇచ్చింది.

ఇప్ప‌టి దాకా విదేశీయులు అమెరికాలోకి వెళ్లాలంటే క‌రోనా టీకా రెండు డోసులు తీసుకుంటే రానిస్తామంటూ చెప్పింది.అయితే ఈ రూల్ ఎప్ప‌టి నుంచి అమ‌లులోకి వ‌స్తుందో మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేదు.

కానీ తాజాగా వైట్ హౌస్ కీలకమైన నిర్ణయం తీసుకుంది.ఇప్ప‌టి దాకా ఈ విష‌యంపై క్లారిటీ ఇవ్వ‌ని అమెరికా ప్ర‌భుత్వం క‌రోనా టీకాలు రెండు డోసులు తీసుకుని నెగిటివ్ వ‌చ్చిన వారంతా రావొచ్చ‌ని ప్ర‌క‌టించింది.

అయితే ఈ విధంగా ఎప్ప‌టి నుంచి రావొచ్చ‌నే దానిపై క్లారిటీ కూడా ఇచ్చేసింది.అదేంటంటే న‌వంబ‌ర్ 8 నుంచి అమెరికా లోకి రావొచ్చంటూ ఆదేశాలు ఇచ్చారు జో బైడెన్‌.

ఇప్ప‌టికే అమెరికా దేశంలో కరోనా కేసుల‌ను త‌గ్గించేందుకు అక్క‌డి ప్రభుత్వం వ్యాక్సిన్ డోసులు తీసుకోకుండా విదేశీయులను రానివ్వ‌బోమంటూ గట్టిగా నిర్ణయించింది.ఇప్ప‌టికీ అదే క‌ఠిన‌మైన రూల్‌ను అమ‌లు చేస్తూ వ్యాక్సిన్ డోసులు తీసుకున్న వారిని మాత్ర‌మే న‌వంబ‌ర్ 8నుంచి రానిస్తామంటూ ప్ర‌క‌టించింది బైడెన్ ప్ర‌భుత్వం.

ఇది ఎంతోమందికి మేలు చేకూర్చే అంశం.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube