ఒకప్పుడు డైరెక్టర్లు తీసే సినిమాలు చాలా కొత్త గా ఉండేవి అందుకే ఆ సినిమాలు చాలా సక్సెస్ ఫుల్ గా ఆడేవి.కానీ ఇప్పుడు వస్తున్న సినిమాలు మొత్తం ఒకప్పుడు వచ్చిన సినిమాలని పోలి ఉంటున్నాయి అందుకే ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా విజయాలను సాధించలేక పోతున్నాయి.అనిల్ రావిపూడి( Anil Ravipudi ) లాంటి డైరెక్టర్ కూడా ఎప్పుడో వచ్చిన స్టోరీలను రిఫరెన్స్ గా తీసుకొని సినిమాలు చేస్తున్నాడు అంతే కానీ కొత్త స్టోరీలను రాయడం లో విఫలం అవుతున్నాడు…
ఇంతకు ముందు జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆయనే స్వయం గా ఈ విషయాలను వెల్లడించారు ఆయన తీసిన మొదటి సినిమా ఆయన పటాస్ సినిమాని బాలయ్య బాబు హీరో గా వచ్చి సూపర్ హిట్ అయిన రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా( Rowdy Inspector ) ఇన్స్పరేశన్ తో తీసాడట.అలాగే సుప్రీం సినిమా ను చిరంజీవి హీరో గా వచ్చిన పసివాడి ప్రాణం సినిమా( Pasivadi Pranam ) రిఫరెన్స్ తో తీసాడట అలాగే రాజా ది గ్రేట్ సినిమా ని ఒక్కడు, విచిత్ర సోదరులు సినిమా రిఫరెన్స్ తో తీసినట్టు గా ఆయనే చెప్పుకొచ్చారు ఆయన ఇంకా మాట్లాడుతూ ఒకప్పుడు ఉన్న మన లెజెండరీ డైరెక్టర్స్ అందరూ కూడా అన్ని స్టోరిలను తీశారు ఇప్పుడు మనం వాళ్ళు చేసిన స్టోరీలను కొంచం మార్చి కొత్తగా చెప్పడమే తప్ప మనం ఇప్పుడు కొత్త స్టోరీలు రాసెంత సీన్ లేదు అంటూ చెప్పారు…
ఇక ప్రస్తుతం ఆయన బాలయ్య బాబు తో చేస్తున్న సినిమా కూడా హరికృష్ణ హీరో గా మీనా హీరోయిన్ గా వచ్చిన స్వామి అనే సినిమా( Swamy ) రిఫరెన్స్ తో చేస్తున్న సినిమా అని తెలుస్తుంది…అయితే అనిల్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే లైన్ వేరే సినిమా ది తీసుకున్న కూడా దాని ట్రీట్మెంట్ లో మాత్రం చాలా డిఫరెంట్ గా చూపిస్తు ఉంటాడు.అందుకే ఆయన సినిమాలు సక్సెస్ అవుతూ ఉంటాయి…