రష్యాకి సీక్రెట్‌గా ఆయుధాలు అందిస్తున్న ఆ దేశాలు..?

రష్యా ఉక్రెయిన్‌పై ( Russia , Ukraine )యుద్ధం మొదలుపెట్టి ఇప్పటికే సంవత్సరం దాటిపోయింది.అయినా రష్యా దగ్గర ఆయుధాలు అయిపోవడం లేదు.

 Those Countries That Are Secretly Providing Weapons To Russia, Russia, Ukraine,-TeluguStop.com

అంతేకాదు, దాని దగ్గర కొత్త కొత్త ఆయుధాలు పుట్టుకొస్తున్నాయి.దీంతో పుతిన్( Putin ) దేశం ఇన్ని ఆయుధాలు ఎక్కడ దాచింది? అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.ముఖ్యంగా అమెరికా, నాటో దేశాలు రష్యా ఆయుధ సంపత్తిపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి.నిజానికి అవి రష్యా వేరే దేశాల నుంచి ఆయుధాలను సేకరిస్తుందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

నిజానికి రష్యా దగ్గర యుద్ధం మొదలు పెట్టిన మూడు నెలల్లోనే ఆయుధాలు అయిపోవాల్సి ఉందని అమెరికా దేశం అంచనా వేసింది.ఆ తర్వాత దేశాన్ని నిరాయుధురాలిని చేసి ఓడించాలని ప్లాన్ చేసింది.కానీ అది జరగలేదు.‌ దాదాపు సంవత్సరాల వరకు పైగా రష్యా తన వద్ద అపరిమిత ఆయుధాలు ఉన్నట్లు రోజుకో కొత్త వెపన్ బయటికి తీసుకొస్తా ఉంది.

ఇరాన్, చైనా, నార్త్ కొరియా( Iran, China, North Korea ) దేశాలు ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు గతంలో రష్యా చెప్పింది.అయితే రష్యా చేసిన వ్యాఖ్యలలో నిజం లేదని ఈ దేశాలు స్పష్టం చేశాయి.ఇక సౌతాఫ్రికా కూడా ఆయుధాలను సరఫరా చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది.కానీ ఈ వ్యాఖ్యలను రష్యా దేశం ఖండిస్తోంది.ఉక్రెయిన్‌ దేశానికే అమెరికా యూరప్ దేశాల నుంచి ఆయుధాలు అందుతున్నాయని, తమకు ఎవరూ ఆయుధాలు అందించడం లేదని రష్యా చెబుతోంది.మొత్తం మీద ఈ వ్యవహారం రష్యా, అమెరికా, నాటో దేశాల మధ్య వాడివేడి చర్చకు దారి తీసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube