టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( samantha ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సామ్ ప్రస్తుతం బాషతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
గత ఏడాది యశోద సినిమాతో సూపర్ హిట్ ని అందుకున్న సమంత ఇటీవలె శాకుంతలం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
ఇకపోతే సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో( Khushi movie ) నటిస్తున్న విషయం తెలిసిందే.అలాగే బాలీవుడ్ లో సిటాడెల్ అనే వెబ్ సిరీస్( A web series Citadel ) లో నటిస్తోంది.
అందులో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా సిటాడెల్ టీమ్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును( President of India Draupadi Murmunu ) కలిసింది.ప్రస్తుతం సిటాడెల్ షూటింగ్ సెర్బియాలో జరుగుతుండగా రాష్ట్రపతి సైతం అక్కడే ఉన్నారు.దాంతో ఆ దేశ అధ్యక్షుడి ఆహ్వానం మేరకు భారత రాష్ట్రపతి మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆ దేశానికి వెళ్లగా సమంత సహా సిటాడెల్ టీమ్ సభ్యులు మర్యాదపూర్వకంగా ద్రౌపది ముర్మును కలిశారు.
రాష్ట్రపతిని కలిసినవారిలో ఫిలిం మేకర్స్ రాజ్ అండ్ డీకే, వరుణ్ ధావన్, సమంతతో పాటు మరో ఇద్దరు ఉన్నారు.
అయితే, రాజ్ అండ్ డీకే ఈ ఎక్స్‌పీరియన్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.గౌరవనీయులైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది.ఆమె కామెడీ సినిమాలంటే ఇష్టం.
కానీ మా యాక్షన్ మూవీని చూసేందుకు ట్రై చేస్తానని చెప్పారు అంటూ పోస్ట్ చేశారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.
ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది.స్ట్రీమింగ్ డేట్ ని ఇంకా చిత్ర బృందం ప్రకటించలేదు.
ఇక సమంత నటిస్తున్న ఖుషి సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.