రష్యాకి సీక్రెట్‌గా ఆయుధాలు అందిస్తున్న ఆ దేశాలు..?
TeluguStop.com
రష్యా ఉక్రెయిన్‌పై ( Russia , Ukraine )యుద్ధం మొదలుపెట్టి ఇప్పటికే సంవత్సరం దాటిపోయింది.
అయినా రష్యా దగ్గర ఆయుధాలు అయిపోవడం లేదు.అంతేకాదు, దాని దగ్గర కొత్త కొత్త ఆయుధాలు పుట్టుకొస్తున్నాయి.
దీంతో పుతిన్( Putin ) దేశం ఇన్ని ఆయుధాలు ఎక్కడ దాచింది? అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
ముఖ్యంగా అమెరికా, నాటో దేశాలు రష్యా ఆయుధ సంపత్తిపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
నిజానికి అవి రష్యా వేరే దేశాల నుంచి ఆయుధాలను సేకరిస్తుందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
"""/" /
నిజానికి రష్యా దగ్గర యుద్ధం మొదలు పెట్టిన మూడు నెలల్లోనే ఆయుధాలు అయిపోవాల్సి ఉందని అమెరికా దేశం అంచనా వేసింది.
ఆ తర్వాత దేశాన్ని నిరాయుధురాలిని చేసి ఓడించాలని ప్లాన్ చేసింది.కానీ అది జరగలేదు.
దాదాపు సంవత్సరాల వరకు పైగా రష్యా తన వద్ద అపరిమిత ఆయుధాలు ఉన్నట్లు రోజుకో కొత్త వెపన్ బయటికి తీసుకొస్తా ఉంది.
"""/" /
ఇరాన్, చైనా, నార్త్ కొరియా( Iran, China, North Korea ) దేశాలు ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు గతంలో రష్యా చెప్పింది.
అయితే రష్యా చేసిన వ్యాఖ్యలలో నిజం లేదని ఈ దేశాలు స్పష్టం చేశాయి.
ఇక సౌతాఫ్రికా కూడా ఆయుధాలను సరఫరా చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది.కానీ ఈ వ్యాఖ్యలను రష్యా దేశం ఖండిస్తోంది.
ఉక్రెయిన్ దేశానికే అమెరికా యూరప్ దేశాల నుంచి ఆయుధాలు అందుతున్నాయని, తమకు ఎవరూ ఆయుధాలు అందించడం లేదని రష్యా చెబుతోంది.
మొత్తం మీద ఈ వ్యవహారం రష్యా, అమెరికా, నాటో దేశాల మధ్య వాడివేడి చర్చకు దారి తీసింది.
ఈ ముగ్గురు దర్శకుల సినిమాలు అందుకే ప్రత్యేకంగా నిలుస్తున్నాయా..?