అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.అనంతరం ఆయన విపక్ష నేతలపై తీవ్రంగా మండిపడ్డారు.
రాష్ట్ర చరిత్రలో ఇవాళ నిలిచిపోయే రోజన్న సీఎం జగన్ శత్రువులపై పేదలు సాధించిన విజయం ఇదని చెప్పారు.పేదవానికి ఇళ్లు రాకుండా అడ్డుకోవాలని చూసిన చంద్రబాబు, ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదని కేసులు వేయించారని మండిపడ్డారు.
పేదలకు ఇళ్లు రాకూడదని హైకోర్టులో 18, సుప్రీంకోర్టులో 5 కేసులు వేశారని విమర్శించారు.అయితే ఎవరెన్నీ అడ్డంకులు సృష్టించినా హైకోర్టు, సుప్రీం ధర్మాసనంలో ప్రభుత్వమే గెలిచిందని తెలిపారు.
పేదల ప్రభుత్వానికి, పెత్తందారుల కూటమికి మధ్య యుద్ధం జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.