అతడు, ఖలేజా, గుంటూరు కారం.. ఈ మూడు సినిమాలను వెంటాడిన దరిద్రమైన సెంటిమెంట్ ఇదే!

టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు హిట్ కాంబినేషన్లుగా గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.అయితే మహేష్ త్రివిక్రమ్( Mahesh, Trivikram ) కాంబినేషన్ మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో విచిత్రమైన కాంబినేషన్ గా పేరు తెచ్చుకుంది.

 Atadu Khaleja Gunturu Karam Cinemas Bad Sentiment Details Here Goes Viral , Tol-TeluguStop.com

ఈ కాంబినేషన్ లో సినిమా అంటే ఆ సినిమా నిర్మాతలకు రూపాయి కూడా మిగలదని నిర్మాతల కెరీర్ ప్రమాదంలోకి వెళుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు( Athadu ) మూవీ తెరకెక్కిందనే సంగతి తెలిసిందే.

మహేష్ అభిమానులు ఈ సినిమా హిట్ అని భావించినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయం కంటే ఎక్కువ రోజులు జరగడంతో పాటు నిర్మాత మురళీ మోహన్ కు ఈ సినిమా ఒకింత నష్టాలను మిగిల్చింది.

ఈ సినిమా తర్వాత మురళీ మోహన్ ( Murali Mohan )సినిమా నిర్మాణానికి దూరమయ్యారు.

Telugu Atau, Guntur Karam, Gunturu Karam, Khaleja, Mahesh, Murali Mohan, Trivikr

మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఖలేజా( Khaleja ) సినిమా తెరకెక్కగా ఈ సినిమా టైటిల్ వివాదంలో చిక్కుకుంది.ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల పాటు జరిగింది.మహేష్ కెరీర్ లో ఎక్కువ రోజులు షూటింగ్ జరుపుకున్న సినిమాలలో ఈ సినిమా ఒకటి.

ఈ సినిమకు శింగనమల రమేష్ బాబు, సి.కళ్యాణ్ నిర్మాతలు కాగా తర్వాత రోజుల్లో శింగమల రమేష్ బాబు పలు వివాదాల్లో చిక్కుకుని ఇండస్ట్రీకి దూరమయ్యారు.

Telugu Atau, Guntur Karam, Gunturu Karam, Khaleja, Mahesh, Murali Mohan, Trivikr

గుంటూరు కారం సినిమా కూడా రిలీజ్ కు ముందే ఊహించని స్థాయిలో వివాదాల్లో చిక్కుకుంటూ ఉండటం గమనార్హం.ఈ సినిమా నుంచి చాలామంది టెక్నీషియన్లు తప్పుకుంటున్నారు.గుంటూరు కారం ( Guntur karam )సినిమా వల్ల నిర్మాతలపై అదనపు భారం పెరుగుతోంది.మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ ప్రకృతికి ఇష్టం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.గుంటూరు కారం మూవీ అయినా నిర్మాతలకు లాభాలను అందిస్తుందేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube