సాధారణంగా ప్రతి ఒక్క హీరో కూడా తాము చేసే సినిమా మంచి సక్సెస్ కావాలని తమ నటించిన సినిమా ప్రేక్షకులను మెప్పించాలన్న ఉద్దేశంతోనే సినిమాలు చేస్తారు అయితే కొన్ని కారణాలవల్ల ఒక సినిమా హిట్ అవుతుంది మరొక సినిమా ప్లాప్ అవుతుంది.సెలబ్రిటీలు మాత్రం సినిమాలపరంగా జయపజయాలను సమానంగానే భావిస్తూ ఉంటారు.
అయితే ఏ సెలబ్రిటీ కూడా ఒక సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిసి మరి సినిమాకు కమిట్ అవుతూ సినిమాలలో నటించరు.కానీ బన్నీ మాత్రం ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిసినప్పటికీ కూడా సినిమాలో నటించారట.
ఈ విధంగా సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిసి కూడా సినిమాలలో నటించడం ఆ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో బన్నీ అభిమానులు సైతం అప్పట్లో ఈయనపై చాలా ఫైర్ అయ్యారు.ఈ విధంగా సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిసినప్పటికీ ఈయన హీరోగా నటించి డిజాస్టర్ ఎదుర్కొన్నటువంటి ఆ సినిమా ఏంటి తెలిసి కూడా ఆ సినిమాలో అల్లు అర్జున్ ( Allu Arjun) ఎందుకు నటించారు అనే విషయానికి వస్తే… అల్లు అర్జున్ సినిమాలు అంటే చాలా మటుకు ఆ సినిమాలు చాలా సరదాగా ఉంటాయనే విషయం మనకు తెలిసిందే.
అల్లు అర్జున్ నుంచే సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తారు అయితే అల్లు అర్జున్ నటించినటువంటి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ( Naa peru surya Naa Illu India ) సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది ఈ సినిమా కథతో డైరెక్టర్ వక్కంతం వంశీ అల్లు అర్జున్ దగ్గరికి వెళ్లి కథ మొత్తం వివరించిన తర్వాత ఈ సినిమా తప్పకుండా పోతుందనే విషయం ఆయనకు తెలుసట.బన్నీ సినిమాలు ఎప్పుడు సరదాగా ఉంటాయి కానీ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలుగా ఉండవు కానీ ఈ సినిమా చేస్తే తప్పకుండా డిజాస్టర్ అవుతుందని తనకి ముందే తెలుసు.
ఇలా సినిమా డిజాస్టర్ అవుతుందని తెలిసినప్పటికీ ఈ సినిమాలో నటించిన వాటిలో ఒకటైన కూడా దేశభక్తి సినిమా ఉండాలన్న ఉద్దేశంతోనే అల్లు అర్జున్ ఈ సినిమాలో నటించారట.తన సినీ కెరియర్ లో నేను కూడా దేశభక్తి సినిమా చేసుకున్నాను అని చెప్పడం కోసం అల్లు అర్జున్ ఈ సినిమా డిజాస్టర్ అవుతుందని తెలిసిన నటించారని ఈయన అంచనాల ప్రకారం ఈ సినిమా డిజాస్టర్ గానే నిలిచింది.ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే పుష్పా సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయినటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ చిత్రం అయినటువంటి పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ వచ్చేయడాది ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఇక ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.