తొలి సినిమా నుంచి ఆర్ఆర్ఆర్ మూవీ వరకు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమా కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధిస్తున్న సంగతి తెలిసిందే.ఆర్ఆర్ఆర్ మూవీతో జక్కన్న కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు.
అయితే ఆర్ఆర్ఆర్ మూవీ విషయంలో జక్కన్న చేసిన తప్పు ఇదే అంటూ అలియా భట్ పాత్ర గురించి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.సినిమా మొత్తంలో అలియా భట్ పాత్ర నిడివి 15 నిమిషాలకు అటూఇటుగా ఉండటం గమనార్హం.
చరణ్ అలియా భట్ మధ్య బలమైన సన్నివేశాలు లేకపోవడం ఆడియన్స్ ను నిరాశకు గురి చేస్తోంది.అంత చిన్నపాత్రకు అలియా భట్ ను తీసుకోవాల్సిన అవసరం ఏముందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
బాలీవుడ్ ప్రేక్షకులకు సైతం ఆర్ఆర్ఆర్ మూవీ నచ్చుతున్నా అలియా భట్ పాత్ర విషయంలో వాళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సమాచారం అందుతోంది.రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఆర్ఆర్ఆర్ లో డైలాగ్స్ పవర్ ఫుల్ గా లేవని చాలామంది కామెంట్లు చేస్తున్నారని అయితే చరణ్, ఎన్టీఆర్ బ్రిటిష్ వాళ్ల దగ్గర తమ ఉనికిని తెలపకుండా ఉంటారు కాబట్టి సినిమాలో పవర్ ఫుల్ డైలాగ్స్ లేవని ఆయన అన్నారు.సీత పాత్రను ఇంకొంచెం పెంచి ఉంటే బాగుండేదని తనకు అనిపించిందని ఆయన చెప్పుకొచ్చారు.చరణ్, తారక్ తమ పాత్రలను అద్భుతంగా చేశారని ఆయన వెల్లడించారు.
ఆర్ఆర్ఆర్ మూవీ దేశభక్తి మూవీ అయినప్పటికీ ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తూ ఉండటంతో తనకు చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.ఈ సినిమాలో పరిస్థితులే విలన్ గా కనిపిస్తూ ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు.మల్టీస్టారర్లు తీసే సమయంలో హీరోల పాత్రలను బ్యాలెన్స్ చేయడానికి ఎక్కువగా కష్టపడాల్సి వస్తుందని ఆయన కామెంట్లు చేశారు.