బాతు నెలకు రూ.లక్షల్లో సంపాదిస్తున్నదని చదివి ఆశ్చర్యపోతున్నారా? మనుషులే ఎంతో కష్టపడితే కాని నెలకు రూ.20 లేదా 30 వేలు వస్తున్న క్రమంలో బాతుకు రూ.లక్షలు ఎలా వస్తాయని మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.బాతు నిజంగానే నెలకు రూ.లక్షల్లో సంపాదిస్తూ సెలబ్రిటీ అయిపోయింది.ఎలాగంటే…
అది నార్మల్ బాతు కాదు.సెలబ్రిటీ బాతు.
దానితో ఒక స్నాప్ దిగితే చాలు లైఫ్ చేంజ్ అయిపోతుంది.ఈ బాతుకు ఉన్న సోషల్ మీడియా అకౌంట్లో బోలెడు మంది ఫాలోవర్స్ ఉన్నారు.
కాగా, ఈ బాతు ఏం చేసినా అది ట్రెండ్ అయిపోతుంటుంది.ఈ బాతు తన కాళ్లతో బొమ్మలు వేస్తుంటుంది.
మనుషుల మాదిరిగా ఫిట్ నెస్ కోసం ఎక్సర్ సైజెస్ చేస్తుంటుంది.పార్కులో మంచిగా ఆటలు ఆడుకుంటుంది కూడా.
అలా ఇది ఎప్పుడూ చాలా హుషారుగా ఉంటుంది.ఇక ఈ బాతు కనబడితే చాలు.
ఫొటోగ్రాఫర్స్ ఎగబడి పోతుంటారు.
సదరు బాతును రకరకాలుగా ఫొటోలు తీసేందుకుగాను ప్రయత్నిస్తుంటారు.
అలా రకరకాల నూతనమైన స్టిల్స్ తీసి ప్రత్యేకంగా ప్రదర్శించాలనుకుంటారు.ఈ బాతు స్పెషాలిటీ ఏంటంటే.
ఇది గతేడాది నవంబరులో నిర్వహించిన న్యూయార్క్ సిటీ మారథాన్లోనూ పార్టిసిపేట్ చేసింది.
ఇక ఈ బాతు ఏం చేసినా అది వింతగానే పరిగణిస్తుంటారు కొందరు.
నిర్వాహకులు ఈ బాతుకు సంబంధించిన ప్రతీ చిన్న విషయాన్ని ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేస్తుంటారు.దాంతో ఆ పోస్టులకు మంచి స్పందన లభిస్తుంటుంది.
అలా బాతు సెలబ్రిటీ స్టేటస్ ఇంకా పెరిగినట్లే అవుతుంది.ఈ క్రమంలోనే ఈ బాతును బిజినెస్ కోసం చాలా మంది ఉపయోగిస్తున్నారు.
ఈ బాతుతో యాడ్స్ చేయించుకుంటున్నారు.ఈ బాతు కనబడితే చాలు.
తమ వ్యాపారం విజయ పథంలో నడుస్తుందని కొందరు భావిస్తున్నారు.మొత్తంగా డక్ కూడా ఓ సెలబ్రిటీ అయిపోయిందండోయ్.