చైన్ కొట్టేసి.. రన్నింగ్ ట్రైన్ లోనుంచి దూకేసి.. షాకింగ్ వీడియో వైరల్

ఈరోజుల్లో దొంగల ఆగడాలకు హద్దే లేకుండా పోయింది.వీరు ఇళ్లలోకి వచ్చి ప్రజలను భయపెట్టి దోచేసుకుంటున్నారు.

 Thief Snatched A Gold Chain From A Moving Train Near Basin Bridge Railway Statio-TeluguStop.com

అవసరమైతే చంపేసి వెళ్ళిపోతున్నారు.ఇక పబ్లిక్ రవాణా వాహనాల్లో కూడా దొంగల నుంచి ప్రజలకు రక్షణ లేకుండా పోయింది.

తాజాగా చెన్నైలో( Chennai ) కదులుతున్న రైలులో ప్రయాణిస్తున్న మహిళ నుంచి ఓ దొంగ బంగారు గొలుసును( Gold Chain ) అపహరించాడు.

వలర్మతి అనే మహిళ నుంచి గొలుసు లాక్కొని ప్లాట్‌ఫారమ్‌పై దొంగ పారిపోతున్నట్లు చూపుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గానూ మారింది.ఇటీవల రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో సర్జరీ విభాగంలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వలర్మతి పని ముగించుకుని ఇంటికి వెళుతోంది.ఆమె చెన్నై సెంట్రల్ నుంచి తిరువళ్లూరుకు రైలు ఎక్కింది.

బేసిన్ బ్రిడ్జి స్టేషన్‌లో( Basin Bridge Railway Station ) రైలు కొద్దిసేపు ఆగినప్పుడు ఈ ఘటన జరిగింది.ఆ కొద్ది సెకన్లలో వలర్మతి వెనుక నిలబడిన ఒక యువకుడు ఆమె గొలుసును వేగంగా లాక్కొని రైలు నుంచి కిందికి దూకి పరిగెత్తాడు.

ఈ ఘటనపై వలర్మతి బేసిన్ బ్రిడ్జి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి ప్రస్తుతం దొంగ కోసం గాలిస్తున్నారు.ఈ వీడియోను @imjournalistsk అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు.ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు బయటికి బంగారం ధరించే రావాలంటేనే వణికిపోతున్నామని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఈ తరహా నేరాలుకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధిస్తే గానీ వీటిని అరికట్టలేమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube