2023 లో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోలు వీళ్లే...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను సంపాదించుకోవడం కోసం వరుసగా సినిమాలు చేస్తూ ఉంటారు.అయితే కొంతమంది మాత్రం సినిమాల బిజీలో పడి వాళ్ళ పర్సనల్ లైఫ్ ని మొత్తానికి మర్చిపోయారు.

 These Are The Telugu Heroes Who Got Married In 2023, Varun Tej , Lavanya Tripat-TeluguStop.com

వాళ్లు ఈ సంవత్సరం అభిమానులందరికీ ఆనందాన్ని కలిగించేలా పెళ్లి చేసుకొని ఒక ఇంటి వారు అయ్యారు వారిలో మొదట గా వరుణ్ తేజ్( Varun Tej ) గురించి చెప్పాలి.

ఈయన లావణ్య త్రిపాఠి( Lavanya tripathi ) ని ప్రేమించి ఈ సంవత్సరం పెళ్లి చేసుకున్నాడు.మిస్టర్ సినిమా సమయం లో ఆమెతో ఏర్పడిన పరిచయం వీళ్ళ స్నేహబందానికి కారణమైంది ఆ తర్వాత అప్పటినుంచి ఇప్పటివరకు ప్రేమగా కొనసాగుతూ వచ్చింది.ఇక గత నెలలో వీరిద్దరి పెళ్లి జరగడంతో ప్రేమతో పులిస్టాప్ పడింది.ఇక అదే రీతిలో వీళ్లిద్దరు ప్రస్తుతానికి హనీమూన్ లో ఎంజాయ్ చేస్తున్నారు…

 These Are The Telugu Heroes Who Got Married In 2023, Varun Tej , Lavanya Tripat-TeluguStop.com

ఇక ఈ సంవత్సరం పెళ్లి చేసుకున్న మరో యంగ్ హీరో శర్వానంద్( Sharwanand )…శర్వా మొదట సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన కూడా ఆ తర్వాత తనదైన రీతిలో నటనని కనపరుస్తూ మంచి సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు.ముఖ్యంగా ఆయన చేసిన సినిమాల్లో వెన్నెల,గమ్యం, ప్రస్థానం, రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి సినిమాలు మంచి గుర్తింపు సంపాదించుకున్నాయి.ఇక ప్రస్తుతం ఈయన రక్షిత రెడ్డి( Rakshitha Reddy ) అనే పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.ఇక ఇప్పుడు సినిమాల మీద ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పుడు ఆయన శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో సక్సెస్ కొట్టి స్టార్ డైరెక్టర్ల దృష్టి ని ఆకర్షించాలని చూస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube