ఇండియాలో అత్యున్నతమైన కోర్సులు ఇవే.. పాస్ కావడం అంత తేలిక కాదు!

ఏ ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌లో అయినా వివిధ కోర్సులు అనేవి చాలా కీలక పాత్ర వహిస్తాయి.విద్యార్థులు అనేవారు తమ భవిష్యత్ కోసం అకడమిక్స్‌లో తమకు నచ్చిన కోర్సులు చదువుతూ వుంటారు.

 These Are The Highest Courses In India It Is Not That Easy To Pass , Indian Cour-TeluguStop.com

అయితే ఏ కోర్సులో చేరినా ఫైనల్‌గా అందుకు సంబంధించిన కీలకమైన పరీక్ష రాయవలసి ఉంటుంది.అందులో పాస్ అయితే వారు నెక్స్ట్ చదవబోయే కోర్సుకు, ఉద్యోగానికి అర్హత అనేది సాధిస్తూ వుంటారు.

లేదంటే చదవాల్సిన సబ్జక్ట్స్ మరలా చదవాల్సి ఉంటుంది.ఇది అందరికీ తెలిసిన విషయమే.

అయితే ఇక్కడ ఎలాంటి కోర్సు తీసుకున్నా చదవడం తేలికని చెప్పుకోవచ్చు.అయితే భారత్‌లో కొన్ని రకాల కోర్సులు మాత్రం చాలా కఠినమైనవి.

ఇంకా వాటిలో ఉత్తీర్ణత సాధించాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది.

అందులో మొదటిది సివిల్ “సర్వీసెస్.” దీనికోసం ఏటా యూపీఎస్సీ( UPSC ) ఓ పరీక్షను నిర్వహిస్తుంది.ప్రభుత్వ యంత్రాంగంలో అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కోసం ఈ పరీక్షను ప్రిలిమ్స్, మెయిన్స్,( Prelims, Mains ) ఇంటర్వ్యూ అలా 3 దశల్లో నిర్వహిస్తారు.

అయితే సివిల్స్ పాస్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది.కొందరు దీన్ని కొరకరాని కొయ్యగా చూస్తారు.కానీ అకుంఠిత దీక్షతో ప్రిపేర్ అయితే ఏమంత కష్టం కాదు.దీని తరువాత “చార్టెడ్ అకౌంటెంట్”( Chartered Accountant ) కోర్సు అనేది కఠినమైనదిగా చెబుతూ వుంటారు.

ఈ కోర్సులో పాస్ కావడమే వరంగా ఫీల్ అయ్యేవారు ఎందరో.అయితే ఉత్తీర్ణత సాధించినవారు అధికమొత్తంలో జీతం తీసుకొనే జీతగాళ్లుగా సెటిల్ అవుతారు.

అలాగే “కంప్యూటర్ సైన్స్”( Computer Science ) గురించి ఇక్కడ ప్రస్తావించాలి.ఈమధ్య కాలంలో చాలా మంది ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ కోర్సు చదవడానికి మొగ్గు చూపుతున్నారు.దానికి కారణం తెలిసినదే ఈ రంగంలో ఉద్యోగవకాశాలు విరివిగా ఉంటాయి.అయితే కంప్యూటర్ సైన్స్ కూడా చాలా కఠినమైన కోర్సు.ఇక దీనితరువాత చెప్పుకోదగ్గది “MBBS.” డాక్టర్స్ బాగా సంపాదిస్తారు అని మనం ఏదేదో మాట్లాడుకుంటాం కానీ, డాక్టర్ చదువు అనేది ఎన్నో వ్యయప్రయాసలతో కూడుకున్నది.హ్యూమన్ అనాటమీ అర్ధంకాక ఎంతోమంది విద్యార్థులు తలలుబాదుకుంటారు.అయితే నిపుణులు ఏం చెబుతారంటే మీరు ఎలాంటి కోర్సు తీసుకున్నా ఇష్టంతోనే తీసుకోవాలని, తరువాత దానికోసం కృషి చేయాలని.

ఎందుకంటే కృషితోనే నాస్తి దుర్భిక్షం.

Top Toughest Courses in India of

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube