Delhi CM Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం..!!

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Delhi CM Arvind Kejriwal ) ఇంటికి ఈడీ అధికారులు( ED Officers ) చేరుకోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.కేజ్రీవాల్ నీ అరెస్ట్ చేస్తారన్న ప్రచారంతో కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు.

 There Is Tension At Delhi Cm Arvind Kejriwals House-TeluguStop.com

దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.అధికారులు ఓ ఫైల్ పట్టుకుని రావడంతో అది అరెస్ట్ వారెంటేనని శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

ఇదే సమయంలో కేజ్రీవాల్ నివాసంలో ఈడీ సోదాలు చేయడంపై ఆప్ నేతలు మండిపడ్డారు.మరొక పక్క కేజ్రీవాల్ నీ ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఈడీ ఆఫీసుకు వెళ్లేందుకు కేజ్రీవాల్ నిరాకరించారు.ఇంట్లోనే ప్రశ్నించాలని కోరారు.దీంతో వ్యవహారం మొత్తం అదుపు తప్పెలా కనిపిస్తూ ఉండడంతో సీఎం నివాసానికి వచ్చే అన్ని దారులను పోలీసులు మూసివేశారు.ఇప్పటికే అక్కడికి చేరుకున్న ఆప్ ముఖ్య నేతలు( AAP Leaders ) ధర్నాకు దిగారు.

సీఎంను లొంగదీసుకునేందుకు బీజేపీ ( BJP ) ఎన్నో అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు.ఈ చర్యలను ఢిల్లీ ప్రజలు గమనిస్తున్నారని, వాళ్లు మౌనంగా ఉండరని హెచ్చరించారు.మరోవైపు ఈడీ అరెస్టు చేయకుండా తనకు రక్షణ కల్పించాలని కేజ్రీవాల్ చేసిన అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిపోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.అరెస్టు కావటం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube