ఆ విషయంలో సంతోషం... టెన్షన్ రెండు ఉన్నాయి.. రామ్ చరణ్ కామెంట్స్ వైరల్!

రామ్ చరణ్ ప్రస్తుతం ఆస్కార్ వేడుకలలో భాగంగా అమెరికాలో సందడి చేస్తున్నారు.ఈయన అమెరికాలో రోజుకొక మీడియా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎన్నో విషయాలను తెలియచేస్తున్నారు.

 There Is Both Happiness And Tension In That Matter Ram Charans Comments Are Vira-TeluguStop.com

ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఇదివరకు తెలియజేస్తున్నటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఆస్కార్ అవార్డు గురించి పలు విషయాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ఆర్‌ఆర్‌ఆర్‌ విషయంలో మేం ఆశించిన దానికంటే ఎక్కువ ప్రేమ, అభినందనలు దక్కాయంటూ ఈయన తెలియజేశారు.

Telugu Kiravani, Oscaraward, Ram Charan-Movie

మంచికి భాషతో పనిలేదు అని ఈ సినిమా మరోసారి నిరూపించిందని ఈ సందర్భంగా చరణ్ తెలిపారు.ఇప్పుడు గ్లోబల్ అయ్యిందన్నారు.ఇలాంటి సినీ గ్లోబలైజేషన్ సమయంలో తాను సినీ ఇండస్ట్రీలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు.

అదేవిధంగా హాలీవుడ్ ఇండస్ట్రీపై తనకు ఉన్నటువంటి అభిప్రాయాలను తెలియజేశారు.తనకు హాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు డైరెక్టర్లతో కలిసి సినిమా చేయాలని ఉంది అంటూ తన మనసులో కోరికను బయటపెట్టారు.

ముఖ్యంగా తనకు జె.జె.అబ్రమ్స్ ఆ తర్వాత క్వాంటిన్ టరాన్‌టినో దర్శకత్వంలో సినిమా చేయాలని ఉందని తెలిపారు.

Telugu Kiravani, Oscaraward, Ram Charan-Movie

ఇక 12వ తేదీ జరిగే ఆస్కార్ వేడుకల గురించి మాట్లాడుతూ ఈయన పలు విషయాలు తెలియచేశారు.ఆస్కార్ అవార్డు వేడుకలలో పాల్గొనే అవకాశం రావడం ఒకవైపు సంతోషంగా ఉన్నప్పటికీ మరో వైపు టెన్షన్ గా కూడా ఉందని వెల్లడించారు.తాను ఎంతగానో అభిమానించే తారలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు వారి ముందు నేను ఒక అభిమానిగా ఉంటానా లేక ఒక నటుడిగా ఉంటానన్న విషయంపై టెన్షన్ ఉందని ఈయన తెలిపారు.ఇక సంగీత దర్శకుడు కీరవాణి గురించి మాట్లాడుతూ ఆస్కార్ అవార్డుకు ఆయన అర్హులని తెలిపారు.27 సంవత్సరాల ప్రస్థానం ఆయనదని తెలియజేశారు.ఆయనని సపోర్ట్ చేయడానికి ఓ కుటుంబంలో మేమందరం ఇక్కడికి తరలి వచ్చామంటూ ఈ సందర్భంగా చరణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube