ఒక్క సారిగా మున్నేరులో పెరిగిన నీటి ఉధృతి

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట: ఒక్క సారిగా మున్నేరులో పెరిగిన నీటి ఉధృతి.నీటి ప్రవాహంలో చిక్కుకున్న కర్మకాండలు చేసే కుటుంబ సభ్యులు.

 The Water Level Increased In Munneru River Details,,water Level Increased ,munne-TeluguStop.com

గ్రామస్తుల సహకారంతో చేకచక్యంగా ఒడ్డుకు చేరారు.పెనుగంచిప్రోలుకు చెందిన చాగంటి దైవదీనం గత రెండు రోజుల క్రితం మృతిచెందాడు.

ఈ మేరకు శనివారం మృతుని చిన్నకర్మ చేసేందుకు కుటుంబ సభ్యులు మున్నేరు వద్దకు వచ్చారు.అప్పటికే ఏటిలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ఏటి మధ్యలో ఉన్న ఇసుక దిబ్బపై కర్మకాండలు చేసేందుకు కుటుంబ సభ్యులు, పూజారి అంతా కలిసి ట్రాక్టర్ పై ఇసుక దిబ్బ మీదకు చేరారు.

కర్మ ప్రక్రియ పూర్తయిన తర్వాత వారంతా అదే ట్రాక్టర్ పై ఎక్కి బయటకు వస్తున్నారు.

ఈ క్రమంలో ఏటిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది.

ట్రాక్టర్ మునిగిపోయేంత నీరు చుట్టూ చేరటంతో ట్రాక్టర్ ఇంజిన్ ఆగిపోయింది.దీంతో ట్రాక్టర్ పై ఉన్న వారంతా ప్రాణ భయంతో కేకలు వేశారు.

వంతెనపై ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు, గ్రామస్తులు గమనించి వారిని రక్షించే ప్రయత్నాలు చేశారు.బలమైన తాళ్ల సాయంతో అతి కష్టం పైన డాక్టర్ పై ఉన్న ఐదుగురిని వంతెన పైకి చేర్చారు.

ట్రాక్టర్కు తాళ్లు కట్టి నీటి ప్రవాహంలో కొట్టుకుపోకుండా పట్టుకున్నారు.ఈలోగా జెసిబి తీసుకువచ్చి దాన్ని నదిలోకి దింపి ట్రాక్టర్ను బయటకు తీసుకువచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube