వామ్మో ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ధర అన్ని లక్షల..? ఈ ధరకు కొత్త కారు కొనేయొచ్చు..!

ప్రస్తుతం వాహన రంగం ఎలక్ట్రిక్ యుగంలో ముందుకు దూసుకుపోతోంది.కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ వస్తువులు మార్కెట్లోకి విడుదల చేయడానికి పోటీ పడుతున్నారు.

 The Price Of This Electric Bicycle Is All Lakhs..? You Can Buy A New Car At Thi-TeluguStop.com

ఈ క్రమంలో <ఎలక్ట్రిక్ సైకిల్స్, ఎలక్ట్రిక్ బైక్స్ కొనడానికే వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు.సరికొత్త హంగులతో ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లోకి అడుగు పెడుతూ ఎప్పటికప్పుడు వినియోగదారులకు ఆశ్చర్యపరుస్తున్నాయి.

ప్రముఖ కంపెనీ ఆడి నుండి ఎలక్ట్రిక్ సైకిల్ ((Electric bicycle)మార్కెట్లోకి అడుగు పెట్టింది.

ఆర్ ఎస్ క్యూ ఇట్రాన్ ఈ2 ఎలక్ట్రిక్ డాక్టర్ ర్యాలీ రేసర్ స్ఫూర్తితో కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ ను ఆడి కంపెనీ(Audi) విడుదల చేసింది.ఇటలీ కు చెందిన ఫ్యాంటిక్ కంపెనీ దీనిని తయారు చేసింది. ఎక్స్ఎంఎఫ్ 1.7 ఆధారంగా దీన్ని రూపొందించారు.250 వాట్ బ్రోస్ మోటర్, హర్లీ డేవిస్ సన్ సీరియస్ 1 బాష్, 720 వాట్ బ్యాటరీ లను కలిగివుంది.

దీని రేంజ్ 95 మైల్స్ ఉండవచ్చు.4 లెవెల్స్ ఎలక్ట్రిక్ అసిస్టెన్స్, అల్యూమినియం తో ఇబైక్ ఫ్రేమ్ డిజైన్, బ్రేకింగ్ ఇన్.కా.ఎస్ డిస్క్ బ్రేక్స్.ఓహ్లీన్స్ ఫోర్క్ అండ్ షాక్, శ్రామ్ కాంపోనెంట్స్ ఫర్ చెయిన్, షిప్ట్టర్స్ అండ్ డెరైల్యూర్ లతో ఉంది.ప్రీమియం ఇటాలియన్ టచెస్ ఉన్ని, విక్టోరియా టైర్స్, షెల్లా ఇటాలియ శ్యాడల్ లతో ఉంది.

మూడు వేరియంట్లతో మార్కెట్లోకి వచ్చిన దీని ధర యూకే(Uk)లో 8499 నుంచి 10,200 డాలర్ల వరకు ఉంది.ఆడి ఎక్స్ క్లూజివ్ డిజైన్, అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీ, అధిక సామర్థ్యం కలిగిన విడిభాగాలు ఉండడంతో దీని ధర రూ.8 లక్షలకు పైగానే ఉంది.ఈ ధర కు కొత్త కారు కొనవచ్చు.

కాకపోతే మంచి లుక్ తో అదిరిపోయే ఫీచర్స్ తొ విడుదల కావడంతో వాహన ప్రియులకు పండగే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube