ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు మనల్ని చాలా అబ్బురపరుస్తాయి.ముఖ్యంగా ఫిజిక్స్ ఎక్స్‌పెరిమెంట్లు చూస్తే అది మంత్ర జాలమా అని ఆశ్చర్యపోక తప్పదు.
సోషల్ మీడియాలో ఎన్నో ఫిజిక్స్ ఎక్స్‌పెరిమెంట్లు ఇప్పటికే వైరలయ్యాయి.వాటిలో కొన్ని ఇంటి వద్ద చేయడం కష్టమైతే… మరికొన్ని మాత్రం చాలా ఈజీగా నిమిషాల వ్యవధిలో ఇంట్లోనే చేయవచ్చు.
తాజాగా అలాంటి ఒక అద్భుతమైన ఎక్స్‌పెరిమెంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షమైంది.దీనిని చూసిన నెటిజన్లు వావ్, ఇది చూసేందుకు ఒక మ్యాజిక్ లాగా ఉంది అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియో ఓపెన్ చేస్తే..ఒక వ్యక్తి చెక్క బల్లపై ఒక అగ్గిపుల్ల పెట్టి దానిపై బరువు ఉంచడం చూడవచ్చు.ఆ తర్వాత బాటిల్‌ను ఒక తాడును కట్టి దానిని ఆ అగ్గిపుల్లకు వేలాడదీశారు.
అనంతరం, ఆ అగ్గిపుల్ల కింద తాడుకు మధ్యలో మరో అగ్గిపుల్ల పెట్టారు.ఈ రెండు అగ్గిపుల్లల మధ్య ఇంకొక అగ్గిపుల్ల పెట్టారు.
ఆ తర్వాత బల్లపై ఉన్న ఇనుప వస్తువు బరువుని తీసేశారు.అయినా కూడా కేవలం ఆ అగ్గిపుల్లలే బరువైన బాటిల్ కింద పడకుండా ఆపగలిగాయి.
రెండు అగ్గిపుల్లల సపోర్ట్‌తో ఒక చిన్న అగ్గిపుల్ల వంద గ్రాముల కంటే బరువైన బాటిల్ మోయగలిగింది.దీని వెనుక ఫిజికల్ సైన్స్ ఉంది కానీ ఇది ఒక ప్యూర్ మ్యాజిక్ అని కూడా చెప్పవచ్చు.
ఈ ప్రయోగం చేయడానికి మీకు మొత్తం మూడు అగ్గిపుల్లలు, ఒక తాడు, నీళ్లు లేదా ఇంకేదైనా లిక్విడ్ ఉన్న బాటిల్, ఒక రాయి లేదా బరువున్న ఏదో ఒక వస్తువు కావాల్సి ఉంటుంది.ఈ ప్రయోగంలో బరువు తొలగించిన తర్వాత చెక్కపై ఉన్న అగ్గిపుల్ల అనేది కిందకి పడిపోవడానికి ట్రై చేస్తుంది.
కానీ దాని కింద ఉన్న మరొక అగ్గిపుల్ల అది కింద పడకుండా ఆపుతుంది.అలాగే వీటి రెండిటికీ కింద ఉన్న మరొక అగ్గిపుల్ల తాడు మధ్య గ్రిప్ ఉంచుకొని ఈ రెండిటినీ కింద పడిపోకుండా నిరోధిస్తుంది.
అలా ఈ మూడు ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూ భారీ బరువును కూడా మోయగలుగుతున్నాయి.ఈ అద్భుతమైన వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.