ఇప్పుడు మన టాలీవుడ్ ( Tollywood )లో నడుస్తున్న ట్రెండ్ ఏంటో తెలిసిందే.ప్రజెంట్ తెలుగు ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తుంది.
స్టార్ హీరోల కెరీర్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను మళ్ళీ ఫ్యాన్స్ కోసం నిర్మాతలు రీ రిలీజ్ చేయడం ఇప్పుడు కామన్ అయిపొయింది.ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోల సినిమాలు తమ పుట్టిన రోజు నాడు రిలీజ్ అవ్వగా అన్ని కూడా మంచి కలెక్షన్స్ ను రాబట్టి మరోసారి నిర్మాతల జేబులను నింపాయి.
ముందులో అన్ని బ్లాక్ బస్టర్ సినిమాలను రిలీజ్ చేసేవారు.కానీ ఇప్పుడు రీ రిలీజ్ కు దక్కుతున్న ఆదరణ చూసి నిర్మాతలు స్టార్ హీరోల కెరీర్ లో హిట్ సినిమాలే కాదు ప్లాప్ సినిమాలను కూడా రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమాలు మంచి స్పందన దక్కించు కుంటున్నాయి.ఇక ఇప్పుడు మరో సినిమా రీ రిలీజ్ కు సిద్ధం అవుతుంది.టాలీవుడ్ సినిమా దగ్గర వచ్చిన పొలిటికల్ డ్రామా చిత్రాల్లో విభిన్నంగా తెరకెక్కి ఆకట్టుకున్న క్లాసిక్ సినిమా ”లీడర్”..
ఈ సినిమాకు థియేటర్స్ లో ఎలాంటి స్పందన లభించినప్పటికీ తెలుగు ఆడియెన్స్ లో ఒక క్లీన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా లీడర్ ఇప్పటికి ప్రేక్షకుల మనసులో నిలిచి పోయింది.
దగ్గుబాటి వారసుడిగా రానా ( Rana Daggubati )మొదటి సారి నటించిన సినిమా లీడర్. శేఖర్ కమ్ముల( Sekhar Kammula ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వకపోయిన ఈ సినిమాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.పొలిటికల్ క్లాసిక్ గా నిలిచినా ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కు సిద్ధం అవుతుంది అనే టాక్ వైరల్ అవుతుంది.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా రీ రిలీజ్ అవ్వబోతుంది అన్నట్టు తెలుస్తుంది.ఇన్నేళ్ల తర్వాత వస్తున్నా ఈ సినిమాకు స్పందన ఎలా ఉంటుందో చూడాలి.