బీజేపీ అభ్యర్థుల జాబితా రెడీ ! ఎవరిపై ఎవరెవరు పోటీ అంటే ..? 

ఇప్పటికే అధికార పార్టీ బీఆర్ఎస్ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంతో బిజెపి కూడా తొలి జాబితాను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది.ఇప్పటికే పార్టీకి చెందిన కీలక నేతలతో మొదటి జాబితాను రూపొందించుకుంది.

 The List Of Bjp Candidates Is Ready! Who Is Competing Against Whom , Brs, Bjp,-TeluguStop.com

బీఆర్ఎస్ కు చెందిన కీలక నాయకులు పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో బిజెపి అభ్యర్థులు ఎవరనేది ప్రకటించేందుకు సిద్ధమయింది.దాదాపు 35 మందితో తొలి జాబితాను ఇప్పటికే సిద్ధం చేసుకుంది.

ఒకటి రెండు రోజుల్లో ఈ జాబితాను విడుదల చేసేందుకు తెలంగాణ బీజేపీ సిద్ధమవుతోంది.తొలి జాబితాలో గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పై  హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను పోటుకి దింపాలని నిర్ణయించింది.

బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటెల రాజేందర్( Eatala Rajender ) హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచారు.

Telugu Aravind, Bandi Sanjay, Bjp List, Bjp Mla Candis, Eatala Rajender, Kisan,

 కేసీఆర్ గజ్వేల్( CM KCR ) లోను పోటీ చేస్తుండడం తో వచ్చే ఎన్నికల్లో ఈటెల రాజేందర్ గజ్వేల్ నుంచి పోటీ చేసినందుకు ఆసక్తితో ఉన్నారు.ఇక ఇదేవిధంగా బీఆర్ఎస్ మంత్రులు , కీలక నాయకులు పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను పోటికి దింపాలని బిజెపి భావిస్తోంది .ఎన్నికల్లో వారు ఓడినా,  తిరిగి ఎంపీలుగా వాళ్లకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు .మంత్రి కేటీఆర్ కు ప్రత్యర్థిగా బిజెపి నుంచి ఎంపీ బండి సంజయ్ ను పోటీకి దించబోతున్నారు.బిజెపి నుంచి ఎంపీలుగా ఉన్న నలుగురు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

Telugu Aravind, Bandi Sanjay, Bjp List, Bjp Mla Candis, Eatala Rajender, Kisan,

కెసిఆర్ పోటీ చేయబోయే కామారెడ్డి నియోజకవర్గం నుంచి నిజామాబాద్ ఎంపీ అరవింద్( Aravind ) పోటీకి దించాలని బిజెపి భావిస్తోంది.అలాగే సిరిసిల్లలో కేటీఆర్ పై బండి సంజయ్,  సిద్దిపేటలో హరీష్ రావు పై బూర నరసయ్య గౌడ్,  రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి పై కొండ విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేయనున్నారు.కరీంనగర్ లో గంగుల కమలాకర్ పై గుజ్జుల రామకృష్ణారెడ్డి , మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్ పై డీకే అరుణ పోటీ చేయబోతున్నట్లు సమాచారం.ఇదేవిధంగా నిర్మల్ లో ఇంద్రకరణ్ రెడ్డి పై మహేశ్వర్ రెడ్డి, అంబర్ పేట్ నుంచి కిషన్ రెడ్డి , మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి , దుబ్బాక నుంచి రఘునందన్ రావు పేర్లు మొదటి జాబితాలో ఉన్నట్లు సమాచారం .కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై ఒక క్లారిటీ వచ్చిన తర్వాత బిజెపి తమ అభ్యర్థుల లిస్టును ప్రకటించాలని నిర్ణయించుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube