తెలంగాణలో ఉపాధ్యాయ బదిలీలను ప్రభుత్వం వేగవంతం చేసింది.ఈ మేరకు ఈనెల 3 వ తేదీ నుంచి 5 వరకు ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది.
అదేవిధంగా 6 మరియు 7 వ తేదీల్లో డీఈవో కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించే అవకాశం కల్పించారు అధికారులు.అనంతరం 8, 9 తేదీల్లో దరఖాస్తుదారుల పేర్లు ప్రదర్శించడంతో పాటు 10, 11 తేదీల్లో అభ్యంతరాలను స్వీకరించనున్నారు అధికారులు.తరువాత12, 13 తేదీల్లో సీనియారిటీ జాబితాను ప్రదర్శించనున్నారు.14న ఎడిట్ చేసుకునేందుకు అభ్యర్థులకు ఆప్షన్ ఇచ్చారు.చివరిగా 15 వ తేదీన ఆన్ లైన్ ద్వారా ప్రధానోపాధ్యాయుల బదిలీలు జరగనున్నాయని అధికారులు వెల్లడించారు.ఇటీవల బదిలీల అంశంపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు దాదాపు 30 వేల మంది బదిలీలతో పాటు దాదాపు 9 వేల మందికి పదోన్నతులు లభించనున్నాయన్న సంగతి తెలిసిందే.
23, 24 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ బదిలీలు జరగనున్నాయి.24న స్కూల్ అసిస్టెంట్ ఖాళీలను ప్రదర్శించనున్న అధికారులు 26, 27, 28 తేదీల్లో ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతులు కల్పించనున్నారు.అదేవిధంగా అక్టోబర్ 3న ఎస్జీటీ, భాషా పండితులు, పీఈటీలు బదిలీలు జరగనున్నాయి.ఈ మేరకు అక్టోబర్ 5 నుంచి 19 వరకు అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు అధికారులు.