ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.05
సూర్యాస్తమయం: సాయంత్రం.6.26
రాహుకాలం: ఉ.10.30 మ12.00
అమృత ఘడియలు: ఉ.9.15 ల10.30 సా4.40 ల6.00
దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ12.48 ల 1.39
మేషం:
ఈరోజు ఆర్థికంగా మీకు నష్టాలు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
వృషభం:
ఈరోజు మీకు బంధువుల ద్వారా ముఖ్య సమాచారం అందుతుంది.ఉద్యోగంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.వ్యాపార వాతావరణం అంతంత మాత్రంగా ఉంటుంది.విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.
మిథునం:
ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
కర్కాటకం:
ఈరోజు మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.ఇంటా బయట మంచి గుర్తింపు లభిస్తుంది.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
సింహం:
ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి దేవదర్శనాల వంటి దూర ప్రయాణాలు చేస్తారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కొన్ని ప్రమాదాలను ఎదుర్కొనే అవకాశం ఉంది.పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.లేదంటే ఇబ్బందులను ఎదుర్కొంటారు.
కన్య:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి.వాదనలకు దిగక పోవడం మంచిది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
తుల:
ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి కనిపిస్తుంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.ఉత్సాహ పరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు ముఖ్యమైన విషయం లో అభివృద్ధి ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.
వృశ్చికం:
ఈరోజు మీరు ఆర్థికపరంగా నష్టాలను ఎదురు చూస్తారు.ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.అనవసరంగా కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఇతరుల నుండి మీకు ఆర్థిక సహాయం అందుతుంది.వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు:
ఈరోజు ఆర్థికపరంగా పొదుపు చేయాలి లేదా నష్టాలు ఎదురవుతాయి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.
మకరం:
ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి సమయానికి మీ చేతికి అందుతుంది.
కుంభం:
ఈరోజు మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
తొందరపడి మీ వ్యక్తిగత విషయాలని ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.లేదంటే ఇబ్బందులను ఎదుర్కొంటారు.
మీనం:
ఈరోజు మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు సమయానికి తిరిగి మీ మీ చేతి అందక నిరాశ చెందుతారు.మీ తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది
.