ఆస్ట్రేలియాపై గొప్పగా పోరాడిన ఇంగ్లాండ్.. థ్రిల్లింగ్ డ్రాతో ముగిసిన నాలుగో టెస్ట్..!

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో 5 మ్యాచ్‌ల యాషెస్‌ సిరీస్ ఆసీస్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ ప్రతిష్ఠాత్మక సిరీస్‌లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జట్టుపై హ్యాట్రిక్‌ టెస్టు విజయాలు సాధించింది.

 The Fourth Ashes Test Series Match Between Australia And England Draw Details,-TeluguStop.com

దీంతో ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది.అయినప్పటికీ నామమాత్రపు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది కాబట్టి మిగిలిన రెండు మ్యాచ్ లు జరుగుతున్నాయి.

ఇందులో భాగంగా తాజాగా నాలుగో టెస్టు జరిగింది.ఈ నాలుగో టెస్టులో కూడా ఇంగ్లాండ్ జట్టు ఘోర పరాజయం చవిచూసే సూచనలే కనిపించాయి.

ఈ టెస్టులో 388 పరుగుల లక్ష్యంతో ఇంగ్లాండ్ బరిలోకి దిగింది.ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌లో 16 ఓవర్లు మిగిలి ఉండగా ఐదు వికెట్ల నష్టానికి 218 పరుగులతో ఇంగ్లాండ్ కుదురుకున్నట్లు కనిపించింది.

కానీ తరువాత మూడు వికెట్లు టపటపా పడిపోయాయి.దీంతో ఇక ఈసారి కూడా ఓటమి ఖాయం అన్నట్లు అందరూ భావించారు.

అయితే ఇంగ్లిష్‌ టెయిలెండర్లు గొప్పగా పోరాడి మ్యాచ్‌ను డ్రాగా ముగించారు.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 416/8 స్కోరుకు డిక్లేర్ చేయగా… ఇంగ్లాండ్‌ 294 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 265/6 స్కోరుకు డిక్లేర్ చేయగా.ఇంగ్లాండ్ 270/9 సాధించి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.

రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ క్రాలీ 13 ఫోర్లు బాది 100 బంతుల్లో 77 చేశాడు.బెన్ స్టోక్స్‌ 123 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్ కొట్టి 60 చేశాడు.

బెయిర్‌స్టో 105 బంతుల్లో 41 పరుగులు చేసి గొప్పగా రాణించాడు.ఈ ప్లేయర్ల వల్లే ఇంగ్లాండ్ ఓటమి నుంచి గట్టెక్కగలిగింది.

Telugu Australia, Cricket, Eng Australia, England, Fourth Ashes, Matche-Latest N

ఆసీస్‌ బౌలర్లలో బోలాండ్‌ 3 వికెట్లు పడగొట్టగా లైయన్‌, కమిన్స్‌ చెరో రెండు వికెట్లు తీసి ఇంగ్లాండ్ కు చెమటలు పట్టించారు.బౌలింగ్‌లో ఆస్ట్రేలియా రాణించింది కానీ ఫీల్డింగ్‌లో మాత్రం పేలవమైన ప్రదర్శనతో నివ్వెరపరిచింది.ఆస్ట్రేలియా ఆటగాళ్లు మూడు క్యాచ్‌లు వదిలేసి, ఓ రనౌట్‌ అవకాశాన్ని చేజేతులా వదిలేసుకుని విజయానికి అడుగు దూరంలో ఉండిపోయారు.ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కూడా సెంచరీలు సాధించిన ఖవాజా మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా అరుదైన గౌరవం దక్కించుకున్నారు.

యాషెస్‌ సిరీస్‌లో చివరి టెస్టు మ్యాచ్ జనవరి 14 వ తేదీన ప్రారంభం కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube