ఇది తెలిస్తే ఒక్క జామకాయ రూ.200 అయిన సరే తప్పకుండా కొని తింటారు

మన పెద్దలు ఆరోగ్యమే మహా భాగ్యం అని అంటూ ఉంటారు.ఎన్ని ఆస్థి పాస్తులు ఉన్నా ఆరోగ్యం సరిగా లేకపోతే కష్టమే.

 The Amazing Health Benefits Of Guava Fruit In Telugu Details, Telugu Health Tips-TeluguStop.com

ఈ రోజుల్లో ఎంత డబ్బు ఉన్నా అన్నీ కొల్చుకుని తినాల్సి వస్తోంది.ఎందుకంటే చాలా రోజులు ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఉండుట వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి.

అప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం కోసం వెతుకులాట ప్రారంభిస్తారు.అయితే ఏ పండు మంచిది అంటే ఆ పండును ఎక్కువగా తినేస్తూ ఉంటారు.

అయితే పెరట్లో కాసే జామ చెట్టులో ఎన్ని పోషకాలు ఉన్నాయో గమనించం.జామకాయలో ఉన్న పోషకాల గురించి తెలిస్తే రోజు జామ కాయ తింటారు.

జ్యూస్‌ను తీసుకోవడంవలన రక్తంలోని కొలెస్ట్రాల్‌ తగ్గటమే కాకుండా కాలేయానికి మంచి టానిక్.జామకాయతో బ్లడ్‌లోని గ్లూకోజ్ లెవల్స్‌ను బాగా తగ్గించవచ్చు.ముఖ్యంగా ఇన్సులిన్ ఉత్పత్తి కానివ్వకుండా బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ లో ఉంచుతుంది.కాబట్టి మధుమేహ రోగులు ప్రతి రోజు ఒక జామకాయ తింటే చాలా మంచిది.

జామలో అతితక్కువ క్యాలరీలు.తక్కువ కొలెస్ట్రాల్.

ఎక్కువ పోషక విలువలు ఉంటాయి.ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన మలబద్దకంను నివారిస్తుంది.

A, B, C విటమిన్లు,యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన వయస్సు రీత్యా వచ్చే ముడతలు తగ్గుతాయి.జామపండు ప్రతి రోజు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.దీనిలో విటమిన్ ఎ, ఫ్లేవనాయిడ్స్ అయిన బీటాకెరోటిన్, లైకోపిన్ ఉండడం వల్ల ఉపిరితిత్తులకు, చర్మానికి, కంటికి చాలా మంచిది.

జామకాయ లో ఉండే పొటాషియం గుండె జబ్బులు, బీపి పెరగకుండా చేస్తాయి.

అంతే కాకుండా జమకాయలో B కాంప్లెక్స్ విటమిన్స్ (B6, B9), E, K విటమిన్స్ ఉంటాయి.ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో జామకాయ ఎంతగానో సహాయపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube