హీరో అక్కినేని నాగచైతన్య థ్యాంక్యూ చిత్రం నుంచి మారో మారో యూత్‌ఫుల్ కాలేజ్ సాంగ్ విడుదల!

నవ యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య మనం లాంటి బ్లాక్‌బస్టర్ తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం థ్యాంక్యూ.సక్సెస్‌ఫుల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.రాశిఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు, టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది.టీజర్‌తో అందరిలోనూ ఆసక్తిని కలిగించిన ఈ చిత్రం నుంచి మారో మారో అనే యూత్‌ఫుల్ కాలేజ్ సాంగ్ లిరికల్ వీడియోను శుక్రవారం విడుదల చేసింది చిత్రబృందం.

 Thank You First Single 'maaro Maaro' : Another Rocking Single By Ss Thaman, Vikr-TeluguStop.com

యూత్‌ఫుల్ మాస్ కాలేజ్‌గా పాటగా చిత్రంలో వుండే ఈ సాంగ్‌కు సక్సెస్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరాలు అందించగా, దీపు అండ్ ప్రదీప్ చంద్ర ఆలపించారు.

ఈ క్యాచీ పాటకు విశ్వ అండ్ కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు.లెజండరీ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.

బీవీఎస్ రవి కథను అందించారు.సినిమా జూలై 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకు సిద్ధమవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube