టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి మనందరికీ తెలిసిందే.ఎన్నో సినిమాలకు మంచి మంచి మ్యూజిక్ ను అందించి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.
కాగా తమన్ ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఇటీవల సర్కారీ వారి పాట సినిమాకు మ్యూజిక్ ను అందించాడు తమన్.
ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలకు సంగీతంతో మంచి క్రేజ్ ను తీసుకు వస్తున్న సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే తమన్ పేరు వినిపిస్తోంది.
ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న తమన్ మొదట్లో ఎన్నో కష్టాలను పడ్డారట.
ఇకపోతే మ్యూజిక్ రంగంలోకి అడుగుపెట్టి జూలై 24 నాటికి 28 ఏళ్ళు పూర్తి అయ్యింది.ఈ సందర్భంగా తమన్ తన కిరీల్లో జరిగిన పలు ఎమోషనల్ సన్నివేశాల గురించి పంచుకున్నారు.
అదేవిధంగా ఒక రేర్ ఫోటోని కూడా షేర్ చేశారు తమన్.ఇక తమన్ షేర్ చేసిన ఫోటోని చూసిన నెటజన్స్ అతనికి అభినందనలు తెలుపుతున్నారు.
తమన్ కి 11 ఏళ్ల వయసులో తమన్ సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టాడు.

టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భైరవద్వీపం సినిమాతో తన కెరీర్ ను మొదలుపెట్టారు తమన్.ఇక ఆ సినిమా కోసం రీ రికార్డింగ్ థియేటర్లో ఉన్నప్పుడు తీయించుకున్న ఫోటోని తాజాగా షేర్ చేశాడు.తమన్ ఆ ఫోటోలో ఎంతో అమాయకంగా కనిపిస్తున్నారు.
అయితే చదువుకోవాల్సిన సమయంలోనే తండ్రి మరణం తమన్ జీవితాన్ని మలుపు తిప్పింది.తండ్రి మరణించిన తర్వాత తన తల్లికి తోడుగా నిలబడి చిన్న వయసులోనే మ్యూజిక్ తో అనుబంధాన్ని పెంచుకున్నాడు.
ఈ క్రమంలోనే మణిశర్మ రాజు కోటి వంటి సంగీత దర్శకుల దగ్గర శిష్యరికం కూడా చేశాడు తమన్.కాగా ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ లో అగ హీరోలు అయినా చిరంజీవి, బాలకృష్ణ,పవన్ కళ్యాణ్, మహేష్ బాబు,ఎన్టీఆర్,రామ్ చరణ్,అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సినిమాకు మంచి మంచి సంగీతాన్ని అందించారు తమన్.ప్రస్తుతం తమన్ బోలెడు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.