నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ‘బింబిసార’ చిత్రం నుంచి ‘తేనె పలుకుల.. ’ వీడియో సాంగ్ రిలీజ్

‘‘ఓ తేనె పలుకుల అమ్మాయి.నీ తీగ నడుములో సన్నాయి లాగిందే’’ అని అందమైన రాజకుమారి పాత్రలో ఉన్న క్యాథరిన్ ట్రెసాను చూసి రాజు పాత్రలోని నందమూరి కళ్యాణ్ కొంటెగా పాడుతుంటే.

 'tene Palukula..' Video Song Release From Nandamuri Kalyan Ram's Film 'bimbisara-TeluguStop.com

దానికి బదులుగా ఆమె ‘‘ఓ కోర మీసపు అబ్బాయి నీ ఓర చూపుల లల్లాయి.బాగుందోయ్’’ అంటూ అతనిలో చిలిపిదనాన్ని మరింతగా రెచ్చగొడుతుంది.

మరి వీరిద్దరూ మధ్య ప్రేమ ఏంటి? ఎలాంటిదో తెలుసుకోవాలంటే ‘బింబిసార‌’ సినిమా చూడాల్సిందేనని అంటున్నారు మేకర్స్.కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన చిత్రాల్లోనటిస్తూ తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న …నందమూరి కథానాయకుడు కళ్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘బింబిసార’.

నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై హ‌రికృష్ణ‌.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ ట్యాగ్ లైన్.వ‌శిష్ఠ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

ఆగస్ట్ 5న ఈ చిత్రం గ్రాండ్ లెవల్లో రిలీజ్ అవుతోంది.

బింబిసార చిత్రంలో కళ్యాణ్ రామ్ మగధ సామ్రాజ్యాధినేత బింబిసారుడిగా కనిపిస్తున్నారు.

ఆయ‌న పాత్ర‌లోని వాడి, వేడిలో.శ‌త్రు భ‌యంక‌రుడిగా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌ళ్యాణ్ రామ్ ఎలా మెప్పించార‌నే విష‌యాన్ని ట్రైల‌ర్‌తో సింపుల్‌గా ట‌చ్ చేశారు.

ఆయ‌న లుక్ డిఫ‌రెంట్ ఆద్యంతం ఆస‌క్తిని పెంచుతోంది.రీసెంట్‌గా రిలీజైన ట్రైల‌ర్, పాట‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది.

శ‌నివారం ఈ సినిమాను ‘ఓ తేనె పలుకుల అమ్మాయి.’ అనే వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

వ‌రికుప్ప‌ల యాద‌గిరి ఈ పాట‌ను రాయ‌టంతో పాటు పాట‌కు అద్భుత‌మైన ట్యూన్‌ను కంపోజ్ చేశారు.హైమంత్ మ‌హ్మ‌ద్‌, స‌త్య యామిని ఈ పాట‌ను పాడారు.

ఛోటా కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి చిరంత‌న్ భ‌ట్ మ్యూజిక్‌.ప్ర‌ముఖ సీనియ‌ర్‌ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి నేప‌థ్య సంగీతాన్ని అందిస్తున్నారు.ఈ చిత్రానికి పాట‌లు: సిరి వెన్నెల సీతారామ‌శాస్త్రి, రామ‌జోగ‌య్య శాస్త్రి, డాన్స్‌: శోభి, ర‌ఘు, ఫైట్స్‌: వెంక‌ట్‌, రామ‌కృష్ణ‌, వి.ఎఫ్‌.ఎక్స్‌: అనిల్ ప‌డూరి, ఆర్ట్‌: కిర‌ణ్ కుమార్ మ‌న్నె, ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు, మ్యూజిక్‌: చిరంత‌న్ భ‌ట్‌, నేప‌థ్య సంగీతం: ఎం.ఎం.కీర‌వాణి, సినిమాటోగ్ర‌ఫీ: ఛోటా కె.నాయుడు, ప్రొడ్యూస‌ర్‌: హ‌రికృష్ణ.కె, ద‌ర్శ‌క‌త్వం: వ‌శిష్ఠ్‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube