తెలుగుదేశం ప్రభుత్వం తప్పు చేసిందన్న జనసేన అధినేత

ఆంధ్రప్రదేశ్ అధికారం వైసీపీ పార్టీ( YCP party ) జనసేన అదినేత పవన్ పై చేసే విమర్శల లో ప్రధాన విమర్శ తెలుగుదేశం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన తెలుగుదేశాన్ని వదిలేసి వైసిపి పై మాత్రమే విమర్శలు చేస్తూ ఉంటారని .అయితే అంశాల వారీగా పవన్ ప్రతిస్పందిస్తాడే తప్ప పార్టీల వారీగా కాదని తెలుగుదేశాన్ని విమర్శించిన వీడియోలను జనసేన నేతలు, కార్యకర్తలు సర్కులేట్ చేస్తూ కౌంటర్ ఇస్తూ ఉంటారు.

 Telugudesam Govt Made Mistake Says Pavan , Ycp Party, Pawan Kalyan, Janasena Le-TeluguStop.com

అయితే అలాంటి సంఘటన ఒకటి ఇప్పుడు తాజాగా జరిగింది.

Telugu Bapulapadu, Janasena, Pawan Kalyan, Mallapally, Ycp-Telugu Political News

కృష్ణా జిల్లాలోని బాపులపాడు( Bapulapadu ) మండలం మల్లపల్లి పారిశ్రామిక వాడ నిర్వాసితులతో నిన్న పవన్ సమావేశం జరిగింది.ఈ పారిశ్రామిక అభివృద్ధి కోసం ఇక్కడి స్థానిక భూములను తెలుగుదేశం హయాంలోసేకరించినప్పటికీ వారికి సరైన నష్టపరిహారం ఇప్పటికీ ఇవ్వలేదని అక్కడ రాజకీయ ప్రమేయం ఉన్నవారికి లేదా తమ సామాజిక వర్గం వారికి మాత్రమే తెలుగుదేశం హయాంలో న్యాయం జరిగిందని, వైసీపీ ప్రభుత్వంలో కూడా తమకు అన్యాయం జరుగుతుందని ఇక్కడ కూడా కొంతమందికి మాత్రమే పరిహారం ఇచ్చారని మల్లపల్లి నిర్వాసితులు జనసేనా నికి ఏకరవు పెట్టారు అయితే ప్రభుత్వాలు ప్రజలను విడదీసి చూసినప్పుడు ఇలాంటి సమస్యలే ఉత్పన్నమవుతాయంటూ పవన్ వారిని ఓదారుస్తూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా విమర్శించారు.2016లో ఇక్కడ రైతుల నుంచి భూములను తీసుకున్నారని నష్టపరిహారం మాత్రం కొందరికే ఇవ్వటం ఏమిటంటూ రైతులను కూడా కులాలే వారేగా విభజిస్తారా? కులాల వారీగా పరిహారం చెల్లిస్తారా అంటూ పవన్ గట్టిగా నిలదీశారు .రైతుల విషయంలో రాజకీయాలు చూడకూడదు అని పవను విజ్ఞప్తి చేశారు.

Telugu Bapulapadu, Janasena, Pawan Kalyan, Mallapally, Ycp-Telugu Political News

అంతేకాకుండా మల్లేపల్లి నిర్వాసితులను తమ ప్రభుత్వం రాగానే ఆదుకుంటామని పవన్ ప్రకటించడం గమనార్హం .తెలుగుదేశం జనసేన మిత్ర పక్షాలని మరికొద్ది రోజుల్లో పొత్తులు కూడా ఫైనల్ అవుతాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో టిడిపి( TDP ) కేంద్రంగా పవన్ చేసిన విమర్శలు చర్చనీయాంశంగానే మారాయి .అయితే ఇది ఇష్యూ బేషుడ్ గానే పవన్ మాట్లాడారు తప్ప తెలుగుదేశం పొత్తులపై ఈ వ్యాఖ్యల ప్రభావం ఉండదంటూ కూడా జనసేన వర్గాలు చెబుతున్నాయి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube