ఈ ఏడాది భారీ విజయాన్ని సాధించిన సినిమాలను పరిశీలిస్తే అందులో విరూపాక్ష మూవీ( Virupaksha Movie ) ముందువరసలో ఉంటుంది.ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను అందించడంతో పాటు ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని క్లారిటీ వచ్చేసింది.
ఈ సినిమాలో సాయితేజ్ హీరోగా నటించగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించారు.అటు సాయితేజ్ ఇటు సంయుక్త( Samyuktha Menon ) తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.

అయితే మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా సాయిపల్లవి( Sai Pallavi ) పేరును మేకర్స్ పరిశీలించారట.అభినయ ప్రధాన పాత్రల్లో సాయిపల్లవి అద్భుతంగా చేయడంతో పాటు సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి మొదట ఆమె పేరును పరిశీలించడం జరిగింది.అయితే సాయితేజ్ కు అదే సమయంలో యాక్సిడెంట్ అయ్యి కోలుకుంటున్న నేపథ్యంలో సాయితేజ్( Sai Tej ), సాయిపల్లవి కలిసి నటిస్తే సాయిపల్లవి డామినేట్ చేసే ఛాన్స్ ఉందని మేకర్స్ భావించారట.
ఈ రీజన్ వల్లే సాయిపల్లవిని ఈ సినిమా నుంచి తప్పించాల్సి వచ్చింది.
అయితే సాయితేజ్, సాయిపల్లవి కాంబో బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విరూపాక్ష సీక్వెల్( Virupaksha Sequel ) లో సాయిపల్లవిని తీసుకోవాలని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
విరూపాక్ష సీక్వెల్ కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో కొన్ని కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి.

అయితే సీక్వెల్ సెట్స్ పైకి వెళితే మాత్రమే వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.విరూపాక్ష మూవీకి సీక్వెల్ అంటే ఆ సినిమా విరూపాక్ష1 ను మించి ఉండాలి.విరూపాక్ష సినిమా కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేసిన నేపథ్యంలో విరూపాక్ష2 మూవీ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంటుందేమో చూడాల్సి ఉంది.







