అరుదైన నల్లపులిని మీరెప్పుడైనా చూశారా? ఇది మీ కోసమే

ప్రకృతిలో ఎన్నో అరుదైన జంతువులు ఉన్నాయి.కొన్ని జంతువులు అంతరించి పోయే దశలో ఉన్నాయి.

 Rare Black Tiger Caught In Odisha Simplipal National Park Details, Rare Black Ti-TeluguStop.com

మరికొన్ని జంతువులు అంతరించి పోయిన జాబితాలో చేరిపోయాయి.అయితే ఎప్పుడైనా అలాంటి జంతువులు కనిపించాయనే వార్తలు విన్నప్పుడు కొంత ఆశ్చర్యం కలగక మానదు.

తాజాగా ఇదే కోవలో కెమెరా కంటికి ఓ వీడియో చిక్కింది.అందులో ఒడిశాలోని సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్‌లో నల్లపులి సంచరించిన అరుదైన దృశ్యం కెమెరాలో బంధించబడింది.

నల్లపులి చెట్టు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేశారు.

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

నల్లపులి చెట్టుపైకి నడుస్తూ, దాని ముందు పాదాలతో పైకి లేచి బెరడును గీసినట్లు వైరల్ వీడియోలో ఉంది.

నారింజ రంగు చారలతో ఉన్న పులిని చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.ఇలా నలుపు రంగు పులులు చాలా అరుదుగా ఉంటాయి.అలాంటి నల్ల పులి భారత్‌లో కనిపించడంతో అంతా సంభ్రమాశ్చర్యాల్లో ఉన్నారు.దీనిని ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

అందులో “పులులు భారతదేశంలోని అడవుల సుస్థిరతకు చిహ్నం… అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా దాని భూభాగాన్ని గుర్తించే అరుదైన మెలనిస్టిక్ టైగర్ యొక్క ఆసక్తికరమైన క్లిప్‌ను పంచుకున్నాను.ఒక టైగర్ రిజర్వ్ పులుల పునరుద్ధరణ కోసం సిద్ధంగా ఉంది”.ఈ వీడియో చూసిన వారంతా ఇలాంటి పులులు కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోతున్నారు.అయితే ఇలాంటి నల్లపులులు చాలా అరుదుగా ఉంటాయని, రెండు విభిన్న జంతువుల కలయిక వల్ల ఇలాంటివి పుడతాయని జంతు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube